Begin typing your search above and press return to search.

ఎవరేమన్నా సరే.. పెద్ద సారు తగ్గేదేలే అంటున్నారు

By:  Tupaki Desk   |   21 Sep 2022 3:53 AM GMT
ఎవరేమన్నా సరే.. పెద్ద సారు తగ్గేదేలే అంటున్నారు
X
అలకలు.. అసంతృప్తి.. ఇవేమీ కూడా తనను కదిలించలేవని.. తాను ఒకసారి డిసైడ్ అయ్యాక తగ్గేదేలె అన్న విషయాన్ని మరోసారి నిరూపించినట్లే అన్న వాదన వినిపిస్తోంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్యూలో. అందరి అంచనాలకు తగ్గట్లే వచ్చిన మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో గెలుపు ధీమాపై ఉన్న సీఎం కేసీఆర్ అభ్యర్థిని ఎవరిని బరిలోకి దించాలన్న దానిపై పెద్ద ఎత్తున కసరత్తు జరిగిన సంగతి తెలిసిందే. తనకున్న అంచనాలు.. తాను చేయించిన సర్వేలలో కూసుకుంట్లనే అభ్యర్థిగా ప్రకటిస్తే మంచిదన్న ఆలోచనను సీఎం కేసీఆర్ ప్రకటించటం తెలిసిందే.

అయితే.. గులాబీ బాస్ నిర్ణయంపై గులాబీ పార్టీ నేతలు పలువురు తప్పు పట్టటమేకాదు.. ఎవరికైనా టికెట్ ఇవ్వొచ్చు కానీ కూసుకుంట్లకు మాత్రంటికెట్ వద్దన్న మాట బలంగా వినిపిస్తోంది.

నిజానికి కూసుకుంట్ల పేరు కేసీఆర్ నోటి నుంచి వచ్చినంతనే.. ఆయన వ్యతిరేకులు పలువురు కల్యాణ మండపంలో సమావేశాన్ని నిర్వహించటం.. ప్రగతి భవన్ కు వచ్చి మరీ కంప్లైంట్ చేయటం తెలిసిందే. ఎప్పుడూ లేని రీతిలో మునుగోడు ఉప పోరు వేళ.. పార్టీ అభ్యర్థి విషయంలో.. ఆయన వ్యతిరేకులు ఇంత భారీగా రావటంతో గులాబీ బాస్ అంతర్మధనంలో పడినట్లుగా తెలుస్తోంది.

అయితే.. పలు విధాలుగా తర్జనభర్జన నేపథ్యంలో చివరకు మునుగోడు గులాబీ టికెట్ ను కూసుకుంట్లకే ఇవ్వాలని గులాబీ బాస్ డిసైడ్ చేసినట్లుగాచెబుతున్నారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వర్గీయులకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.గతంలో పార్టీ తరఫున పోటీ చేసిన ఓడిన కూసుకుంట్ల మీద ఓటర్లలో పెద్ద ఎత్తున సానుభూతి ఉందని.. అదంతా తమకు కలిసి వస్తుందన్న నమ్మకంతో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.

త్వరలో నే అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. ముందు అయితే.. కూసుకుంట్లనే అభ్యర్థి అన్న విషయాన్నిక్యాడర్ లోకి అనధికారికంగా ప్రచారంలోకి తీసుకురావాలన్న మాట చెప్పినట్లుగా చెబుతున్నారు.

తమ మాటకు భిన్నంగా.. కూసుకుంట్లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. టికెట్ కన్ఫర్మ్ చేసిన కేసీఆర్ పై అసంతృప్త వర్గం కారాలు మిరియాలు నూరే వీలుందన్న మాట వినిపిస్తోంది. తగ్గేదేలే అన్న రీతిలో కూసుకుంట్లే అభ్యర్థి అని తేలుస్తున్న కేసీఆర్ నిర్ణయం ఏ మేరకు వర్కువుట్ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.