Begin typing your search above and press return to search.

కేసీఆర్ నోట బంగారం విరాళం మాట.. తొలిరోజే అన్ని కేజీలు వచ్చేసింది

By:  Tupaki Desk   |   20 Oct 2021 4:42 AM GMT
కేసీఆర్ నోట బంగారం విరాళం మాట.. తొలిరోజే అన్ని కేజీలు వచ్చేసింది
X
ముఖ్యమంత్రులు చాలామంది రావొచ్చు.. పోవచ్చు. కానీ.. కొందరి హయాంలో చేపట్టిన కార్యక్రమాలు మిగిలిన వారికి భిన్నంగా.. చరిత్రలో నిలిచిపోయేలా చేస్తాయి. తిరుమల తిరుపతి అన్నంతనే నాడు ఎన్టీఆర్ చూపిన ప్రత్యేక శ్రద్ధతో.. ఆ పుణ్యక్షేత్రం ఎంతలా మారిపోయిందో తెలిసిందే. కట్ చేస్తే.. మళ్లీ ఇన్నాళ్లకు కేసీఆర్ పుణ్యమా అని.. యాదాద్రి ఆలయ దశ.. దిశ మారిపోయిందని చెప్పాలి. భారీ ఖర్చుతో ఆలయాన్ని మార్చివేయటమే కాదు.. కలలో కూడా ఊహించనిరీతిలో ఆలయం తయారవుతోంది.

వచ్చే మార్చి 28న నిర్వహించే మహా సంప్రోక్షణ తర్వాత నుంచి భక్తులకు మూల విరాట్టు దర్శనాన్ని కల్పించనున్నారు. ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. యాదాద్రి ఆలయ విమాన గోపురాన్ని బంగారంతో తాపడం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. ఇందుకు అవసరమైన 125 కేజీల బంగారాన్ని ఆయన ప్రభుత్వం నుంచి కాకుండా ప్రజల నుంచి వస్తే బాగుంటుందని భావించారు. మాట చెప్పటం కన్నా.. చేతల్లో చూపించాలన్నట్లుగా కేసీఆర్ తమ కుటుంబం తరఫున ఒకకేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా ప్రకటించి.. మిగిలిన వారు కూడా ఇస్తే బాగుంటుందన్నారు.

కేసీఆర్ నోటి నుంచి బంగారం విరాళం ఇవ్వాలన్న మాట వచ్చిన కాసేపటికే.. బంగారం పోటెత్తింది.ఎవరికి వారు తమ వంతుగా బంగారాన్ని ప్రకటించేందుకు పోటీ పడ్డారు. మొదటిరోజునే భారీ ఎత్తున బంగారానికి అవసరమైన విరాళాలు పోటెత్తతాయి. ప్రసార మాధ్యమాల్లో కేసీఆర్ ప్రకటన పెద్దగా రాకపోవటంతో మిగిలిన వారు స్పందించలేదు. వారు కూడా ముందుకు వస్తే.. కేసీఆర్ అనుకున్న 125 కేజీలు.. దాదాపు వారం వ్యవధిలోనే సమకూరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

బంగారం తాపటం చేయటానికి రూ.65 కోట్ల ఖరర్చు అవుతుందని.. ప్రభుత్వానికి అదేమీ పెద్ద భారం కాదని కానీ ప్రతి గ్రామం ఇందులో భాగస్వామ్యం కావాలన్న సెంటిమెంట్ మాట కేసీఆర్ నోటి నుంచి వచ్చింది. ఇదొక్కటి చాలు.. బంగారం గ్రాములు.. కేజీల చొప్పున పోటెత్తటానికి అని చెప్పాలి. రిజర్వు బ్యాంకు నుంచి 125 కేజీల్ స్వచ్ఛమైన బంగారాన్ని కొంటామని ప్రకటించారు.

తొలిరోజు కేసీఆర్ బంగారాన్ని విరాళంగా ఇవ్వాలన్నమాట తర్వాత అత్యధిక విరాళాన్ని హెటిరో గ్రూపు ఛైర్మన్ పార్థసారథి రెడ్డి ఐదు కేజీల బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇక.. కేజీ చొప్పున బంగారాన్ని ప్రకటించిన వారిని చూస్తే..

- చిన జీయర్ స్వామి
- మంత్రి హరీశ్ రావు
- మంత్రి మల్లారెడ్డి
- మేడ్చల్ ప్రజల తరఫున మంత్రి మల్లారెడ్డి
- నాగర్ కర్నూలు ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి
- జనార్థనరెడ్డికి చెందిన క్లాత్ షోరూం తరఫున రెండు కేజీలు
- చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి
- శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ
- మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
- కుకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం క్రిష్ణారావు
- కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్
- ఎమ్మెల్సీ నవీన్ కుమార్
- ఎమ్మెల్సీ శంభీపూర్ రాజ్
- కావేరీ సీడ్స్ అధినేత భాస్కర్ రావు
- నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు
- కడప జిల్లా చిన్న మండెం జెడ్పీటీసీ సభ్యురాలు
- వ్యాపార వేత్త మోడెం జయమ్మ