Begin typing your search above and press return to search.
కేజీల చొప్పున బంగారం చెప్పండి.. ఖాతాల్లో మాత్రం డబ్బులు వేయండి
By: Tupaki Desk | 21 Oct 2021 8:34 AM GMTయాదాద్రి దేవాలయం విమాన గోపురాన్ని తిరుమలలో మాదిరి స్వర్ణ తాపడం చేయించటం కోసం కేసీఆర్ తన మనసులోని ఆలోచనను తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. బంగారు తాపడానికి అయ్యే 125 కేజీల బంగారాన్ని సమకూర్చటం ప్రభుత్వానికి పెద్ద విషయం కాదని.. కానీ ఈ పుణ్య కార్యంలో అందరూ పాల్గొంటే బాగుంటుందన్న ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేయటం తెలిసిందే. ఇందులో భాగంగా ఎప్పుడూ లేనట్లుగా సీఎం కేసీఆర్ తన కుటుంబం తరఫున ఒక కేజీ పదహారు తులాల బంగారాన్ని విరాళంగా ఇస్తానని ప్రకటించటం తెలిసిందే.
తొలిరోజున బంగారం విరాళాన్ని ఇవ్వటం కోసం దాతలు పెద్ద ఎత్తున ముందుకు రావటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. బంగారం విరాళం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆసక్తికర సూచన చేసింది. విమాన గోపురానికి బంగారాన్ని దానంగా ఇవ్వాలని భావించేవారు.. తమ దానాన్ని కేజీల లెక్కలో బంగారాన్ని ప్రకటించాలని.. బ్యాంకుఖాతాలో మాత్రం అందుకు సరిపోయే మొత్తాన్ని జమ చేయాలని కోరుతున్నారు.
బంగారాన్నివిరాళంగా ఇచ్చే వేళలో.. నాణ్యత విషయంలో హెచ్చుతగ్గులకు గురయ్యే అవకాశం ఉందని.. విమాన గోపురం కోసం స్వచ్ఛమైన బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని.. అందుకే బంగారానికి బదులుగా డబ్బుల్ని బ్యాంకు ఖాతాలో జమ చేయాలని కోరుతున్నారు. బంగారాన్ని విరాళంగా ఇవ్వాలని భావిస్తున్న వారి కోసం ప్రత్యేకంగా ఒక ఖాతాను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన వివరాల్ని తాజాగా వెల్లడించారు.
ఈ కార్యక్రమంకోసం యాదాద్రి ఇండియన్ బ్యాంకులో ప్రత్యేకంగా ఒక ఖాతాను తెరిచారు. దాతలు అకౌంట్ నం. 6814884695, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఐడీఐబీ000వై011కు నగదు జమ చేయాలని దేవస్థానం ఈఓ గీతారెడ్డి వెల్లడించారు. విరాళాలు పారదర్శకంగా ఉండేందుకు బ్యాంకు ద్వారానే తీసుకోనున్నట్లు చెప్పారు. నిజమే.. అనవసరమైన తలనొప్పులకు అవకాశం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారనే చెప్పాలి.