Begin typing your search above and press return to search.
కేసీఆర్ బిగ్ ప్లాన్.. పంచాయతీలకు నిధులు!
By: Tupaki Desk | 13 Jan 2023 2:30 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిగ్ ప్లాన్ వేసినట్టు కనిపిస్తోంది. తాజాగా ఆయన మహబూబాబాద్‌లో పర్యటించారు.ఈ సందర్భంగా ఇక్కడి గ్రామ పంచాయతీలకు ఏకంగా రూ.10 లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు పంచాయతీ సర్పంచులు ప్రగతి భవన్‌కు వచ్చేందుకు కూడా అనుమతించలేదు. అలాంటిది అనూహ్యంగా వారిపై ప్రేమ పొంగుకురావడం గమనార్హం.
ఇక, ఇక్కడ నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడ్డాక అనేక అభివృద్ధి పనులు చేసుకున్నామని చెప్పారు. చాలా జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే కలెక్టరేట్లు ప్రజా సమస్యలు తీర్చే కార్యాలయాలుగా మారాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. మహబూబాబాద్లో నిర్మించిన నూతన కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. ప్రభుత్వ శాఖలన్నీ ఒకేచోట కొలువుదీరి ప్రజలకు పారదర్శక సేవలందించేలా వ్యవహరిస్తున్నామన్నారు.
ఇప్పటికే పలు జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు అందుబాటులోకి రాగా.. నేడు మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించారు. 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.58 కోట్లతో నిర్మించిన ఈ కలెక్టరేట్ సముదాయం అన్ని హంగులతో ముస్తాబైంది. అంతకుముందు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని పార్టీ అధినేత కేసీఆర్ తన చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ క్రమంలోనే కేసీఆర్ పంచాయతీపై వరాల జల్లు కురిపించారు. తన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి పది లక్షల రూపాయల చొప్పున ప్రతి పంచాయతీకి చెల్లిస్తామని కేసీఆర్ చెప్పారు. అంతేకాదు.. ఈ నిధులను ఎలా ఖర్చు చేసుకున్నా.. ఇబ్బంది లేదంటూ.. మరింతగా సర్పంచులకు స్వేచ్ఛ ఇవ్వడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.