Begin typing your search above and press return to search.
సిటీ టు ఫామ్ హౌస్.. ఫామ్ హౌస్ టు సిటీ.. మళ్లీ ఫామ్ హౌస్
By: Tupaki Desk | 13 Dec 2019 6:49 AM GMTసిటీ నుంచి ఊరికెళ్లి.. మళ్లీ సిటీకి వచ్చి పనులు చేసుకొని మళ్లీ ఊరికి వెళ్లటమంటే ఎంత చికాకు? అది కూడా ఒక రోజు వ్యవధిలో అంటే.. మామూలుగా ఉండదు. కానీ.. ఇంతటి బిజీ షెడ్యూల్ ను పంటి బిగువున పెట్టుకొని తిరుగుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఫామ్ హౌస్ లో కొత్త ఇల్లు ఏ ముహుర్తం లో మొదలు పెట్టారో కానీ.. దాని కోసం కేసీఆర్ ఎంతగా తిరిగారో చెప్పాల్సిన అవసరమే ఉండదంటున్నారు.
అదే పనిగా తిరుగుడుతోనే కాలం సరిపోతుందని చెబుతున్నారు. ఎక్కడి దాకానో ఎందుకు? బుధ..గురువారాల సంగతే తీసుకుంటే ఆయన చేస్తున్న ప్రయాణాల్ని చూసి ఫిదా కావాల్సిందే. ఎంత ఓపిక పెద్దమనిషికి అని మురిసిపోవాల్సిందే. ఫామ్ హౌస్ లో తాను నిర్మించిన కొత్తింటి గృహప్రవేశ కార్యక్రమం గురువారం పెట్టుకున్నారు. ఈ ముహుర్తం దాటితో మళ్లీ ఫిబ్రవరి వరకూ మంచి ముహుర్తాలు లేక పోవటంతో.. హడావుడి గా చేసుకోవాల్సి వచ్చిందని చెబుతారు.
బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఫామ్ హౌస్ కి వెళ్లిన కేసీఆర్.. తెల్లవారు జామున నుంచే గృహ ప్రవేశానికి సంబంధించిన పూజల్లో పాల్గొన్నట్లు చెబుతున్నారు. మధ్యాహ్నం వరకూ ఆ బిజీలోనే ఉన్న ఆయన.. సాయంత్రం అయ్యేసరికి సిటీకి రావాల్సి వచ్చింది.సీఎస్ ఎస్ కే జోషి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. నగరం లోని మరో ప్రైవేటు కార్యక్రమానికి కూడా హాజరైనట్లు గా చెబుతున్నారు. తిరిగి రాత్రికి ఎర్రవెల్లికి చేరుకున్నారు. గృహప్రవేశం రోజున దంపతులు కొత్తింట్లో నిద్ర చేయాలన్న సంప్రదాయం కోసం సీఎం కేసీఆర్ ఇంత కష్టానికి సిద్ధమయ్యారని చెబుతున్నారు. రోజు వ్యవధిలో అంత ప్రయాణాలు చేసే కేసీఆర్ ఓపికకు హేట్సాఫ్ చెప్పాల్సిందే.