Begin typing your search above and press return to search.
ఆ ’త్యాగరాజు’ ఎవరో తేలేది ఎప్పుడు ?
By: Tupaki Desk | 21 Oct 2020 12:30 AM GMTఇపుడిదే చర్చ అధికార టీఆర్ఎస్ లో పెరిగిపోతోంది. ఎంఎల్సీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత పోటి చేయాలని డిసైడ్ అయినపుడే ఆమె గెలుపు ఖాయమైపోయింది. ఎందుకంటే స్ధానిక సంస్ధల్లో నిజామాబాద్ జిల్లాలో అధికారపార్టీ ఓట్లే ఎక్కువ. పైగా పోటీ చేయాలని అనుకున్నది స్వయంగా సీఎం కేసీయార్ కూతురు. ఇక అడ్డుకునేవాళ్ళు ఎవరున్నారు ? అందుకనే నామినేషన్ వేయటం ఆలస్యం కవిత గెలుపు ఖాయమని తేలిపోయింది. సరే ఆ ముచ్చట కూడా పూర్తియిపోయింది.
పోటీ చేయటం ఖాయమని తేలిపోయినపుడే మంత్రిపదవి కూడా ఖాయమని అర్ధమైపోయింది. మరి మొదటి ముచ్చట అయిపోయింది. ఇక రెండో ముచ్చట ఎప్పుడు ? ఇఫుడిదే విషయమై చర్చలు జోరుగా పెరిగిపోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కవితకు మంత్రివర్గంలో చోటు దక్కాలంటే ఎవరో ఒకరు తమ స్ధానాన్ని త్యాగం చేయాల్సిందే. మరి ఆ త్యాగరాజు ఎవరు ? అన్నదే సస్పెన్సుగా మారిపోయింది.
ఇక్కడ రెండు మూడు అంశాలున్నాయి. మొదటిదేమో కవితకు మంత్రివర్గంలో చోటు కోసం ఎవరో ఓ మహిళా మంత్రితో రాజీనామా చేయిస్తారనేది మొదటిది. ఇక రెండో విషయం ఏమిటంటే కవిత నిజామాబాద్ నుండి ఎన్నికయ్యారు కాబట్టి నిజామాబాద్ మంత్రితోనే రాజీనామా చేయిస్తారని వినిపిస్తోంది. ఇక్కడే మూడో ఆప్షన్ కూడా వినిపిస్తోంది లేండి. అదేమిటంటే కేసీయార్ కు నమ్మకస్తుడైన మంత్రినే రాజీనామా చేయమని చెప్పి సదరు త్యాగరాజుకు మరో కీలక పదవిని కట్టబెడతారన్నది.
సరే ఎవరినో ఒకళ్ళని రాజీనామా చేయమని అడగటం బావోదని అనుకునే పక్షంలో శాసనమండలిలో చీఫ్ విఫ్ పదవి ఇస్తే ఎలాగూ క్యాబినెటర్యాంకే కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవని కూడా చెప్పుకుంటున్నారు నేతలు. మొత్తానికి మంత్రపదవి విషయంలో జిల్లాలోని ఎంఎల్ఏలంతా తొందరలోనే కేసీయార్ ను కలవాలని అనుకుంటున్నట్లు సమాచారం. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.