Begin typing your search above and press return to search.
మోడీని ఇంతలా తిట్టేస్తున్నా కేసీఆర్ ను టార్గెట్ చేయటం లేదెందుకు?
By: Tupaki Desk | 11 July 2022 5:30 PM GMTప్రధాన మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని పట్టుకొని నోటికొచ్చి మాట్లాడతారా? సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా? ఏమైనా న్యాయమా? అసలు బుద్ధి ఉందా? అంటూ కొంతకాలం క్రితం ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తిట్టి పోయటం తెలిసిందే. ప్రధాని పదవికి ఉండే మర్యాదను తక్కువ చేసే వారి విషయంలో ఉపేక్షించాల్సిన అవసరం లేదని.. కేసులు పెట్టేయాలని కూడా అప్పట్లో కేసీఆర్ నోటి నుంచి వచ్చింది. అలాంటి గులాబీ బాస్.. ఆదివారం సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా తిట్టిపోసిన వైనం పెద్దగా ఆశ్చర్యపర్చలేదు.
ఎందుకంటే నచ్చినప్పుడు ఆకాశానికి ఎత్తేయటం.. తేడా వస్తే పాతాళానికి తొక్కేయటం లాంటివి కేసీఆర్ కు అలవాటైన విషయాలే కాబట్టి.. గతంలో తన నోటి నుంచి వచ్చిన మాటలకు భిన్నంగా ప్రధాని మోడీని ఉద్దేశించి ఘాటు విమర్శలు చేయటంతో పాటు.. తిట్టిపోయటం లాంటివి చేశారు. ఆ మాటలకు వస్తే.. గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని డైలీ బేసిస్ లో విమర్శలు గుప్పించటం.. కేంద్రం మీద విరుచుకుపడటం లాంటివి చేయటం తెలిసిందే.
తండ్రీకొడుకులు ఇంతలా మోడీ అండ్ కోను డ్యామేజ్ చేస్తున్నా.. కేంద్రాన్ని ఉద్దేశించి అన్నేసి తిట్లు తిడుతున్నా.. కమలనాథులు ఎందుకని కామ్ గా ఉంటున్నారు? అన్నదిప్పు్డు ప్రశ్నగా మారింది. అయితే.. తాము శత్రువుగా డిసైడ్ అయిన వారి విషయంలో ముప్పేట దాడి చేయటం ద్వారా వారి సంగతి తేల్చే మోడీ అండ్ కో.. కేసీఆర్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉన్నట్లు చెబుతున్నారు.
మిగిలిన రాష్ట్రాల్లో మాదిరి కాకుండా.. కేసీఆర్ విషయంలో ప్రత్యేకమైన ప్లానింగ్ తో బీజేపీ అధినాయకత్వం ఉందంటున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో తాము టార్గెట్ చేసిన వారిపై ప్రయోగించిన ఈడీ.. సీబీఐ లాంటివి వినియోగిస్తే.. కేసీఆర్ మీద సానుభూతి పెరిగే అవకాశం ఉందని.. అందుకే గులాబీ బాస్ ఎన్నేసి మాటలు అంటున్నా.. చూస్తూ ఉండాలే తప్పించి తొందరపడి రియాక్టు కాకూడదన్న ఆలోచనలో బీజేపీ అధినాయకత్వం ఉందని చెబుతున్నారు.
తెలంగాణలో బీజేపీ బలం పెరగటం.. ప్రజల్లో బీజేపీ మీద సానుభూతి.. టీఆర్ఎస్ మీద ఆగ్రహం పెద్ద ఎత్తున పెరగటం.. ప్రభుత్వ వ్యతిరేకత భారీగా పెరిగే వరకూ వెయిట్ చేయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే కేసీఆర్ మీద జాతీయ స్థాయి నేతలు ఎవరూ వ్యక్తిగత విమర్శలు చేయకూడదన్న పాలసీని పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. తమ చర్యలతో కేసీఆర్ మీద సానుభూతి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం.. మరోవైపు బరితెగించి మాట్లాడుతున్నారన్న భావన కలిగిన తర్వాత తాము రంగంలోకి దిగాలన్న యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
కేసీఆర్ మీద ఒకసారి వ్యతిరేకత వచ్చిన తర్వాత బీజేపీ బలగాలన్ని యుద్ధ ప్రాతిపదికన ఒక్కసారి రంగంలోకి దిగి ఉక్కిరిబిక్కిరి చేయాలని.. అదే సమయంలో ఈడీ.. సీబీఐ లాంటి సంస్థలు సైతం తమ పని తాము చేస్తాయని చెబుతున్నారు. ఆలోపు కేసీఆర్ సర్కారు అవినీతి భారీగా జరిగిందన్న భావన కలిగేలా పరిస్థితులు చోటు చేసుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. కేసీఆర్ రెచ్చగొడితే రెచ్చిపోకుండా తమ వ్యూహం ప్రకారమే ముందుకు వెళ్లాలన్న కచ్చితమైన ప్లాన్ లో కమలనాథులు నడుస్తున్నట్లుగా చెబుతున్నారు. మరేం జరుగుతుందో కాలమే డిసైడ్ చేయాలి.