Begin typing your search above and press return to search.

నెక్లెస్ రోడ్డు ఇక కనిపించదు ... సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   31 May 2021 8:30 AM GMT
నెక్లెస్ రోడ్డు ఇక కనిపించదు ... సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం !
X
సీఎం కేసీఆర్ .. ఏ విషయంలో అయినా కూడా ఓ నిర్ణయం తీసుకోవడం అయన తర్వాతే ఎవరైనా. ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ మాట మీద నిలబడటం, సమయానికి తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవటంలో కేసీఆర్ ప్రత్యేక శైలి. ఇకపోతే తాజాగా సీఎం కేసీఆర్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ మహా నగరానికే నెక్లెస్ తరహాలో ఉన్న నెక్లెస్ రోడ్ పేరు ఇకపై వినిపించదు. ఎందుకంటే ప్రభుత్వం ఆ పేరును మార్చేసింది. నెక్లెస్ రోడ్డును ఇక మీదట పీవీ నరసింహారావు మార్గ్‌ గా పిలవనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ నామకరణం చేసింది.

పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఈ నామకరణ చేసినట్లు తెలంగాణ క్యాబినెట్ వెల్లడించింది. అంతేకాకుండా నెక్లెస్ రోడ్‌ లో పీవీ నరసింహారావు ఘాట్ కూడా ఉంది. నరసింహారావు మరణించిన అనంతరం 12 ఎకరాల స్థలంలో ప్రభుత్వం ఘాట్‌ ను నిర్మించింది. అయితే, హుస్సేన్ సాగర్‌ ను ఆనుకొని ఐదున్నర కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ నెక్లెస్ రోడ్డు పేరును మార్చాలని కేబినెట్‌ లో తీర్మానించారు. ఈ మేరకు ఏకగ్రీవంగా పీవీ నరసింహారావు పేరు పెట్టాలంటూ కేబినెట్ తీర్మానం చేసింది. ఇక మీదట నెక్లెస్ రోడ్‌ను పీవీ నరసింహారావు మార్క్‌ గా పిలవనున్నారు. ప్రేమికులకు, పర్యటకులకు ఎంతో ఆహ్లాదకరమైన నెక్లెస్ రోడ్డు పేరు ఇకపై పీవీ నరసింహారావు మార్గ్‌ గా మారిపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా ముందుకు వచ్చి , నాలుగు కూడలి రోడ్డులో ముందుకు వెళితే సెక్రటేరియట్ , కుడి వైపునకు తిరిగితే ప్రసాద్ ఐమ్యాక్స్ , ఎడమ వైపునకు తిరిగితే ఐదున్నర కిలోమీటర్ల నిడివి ఉండే నెక్లెస్ రోడ్ తెలిసిందే. ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించే నెక్లెస్ రోడ్డుకు అనూహ్యమైన పేరును డిసైడ్ చేశారు సీఎం కేసీఆర్.

పీవీని పట్టించుకోని కాంగ్రెస్ కు షాకిస్తూ , తాము పీవీని నెత్తిన పెట్టుకుంటామని చెప్పటమే కాదు. అందుకు తగ్గట్లు ఎప్పటికప్పుడు ఏదో ఒక నిర్ణయంతో పీవీ పేరు నానేలా చేసే సీఎం కేసీఆర్. పీవీ పేరును రాజకీయ అవసరాలకు మాత్రమే కేసీఆర్ వాడుకుంటున్నారంటూ టీ కాంగ్రెస్ నేతల విమర్శల్లో పస లేదన్న విషయాన్ని తాజా నిర్ణయంతో తేల్చేశారని చెప్పాలి కేసీఆర్.