Begin typing your search above and press return to search.
మోదీతో కేసీఆర్ భేటీ... పెండింగ్ నిధులే ప్రధానాంశం
By: Tupaki Desk | 12 Dec 2020 5:20 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా శనివారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. గురువారం ఢిల్లీ వచ్చిన కేసీఆర్... ఇప్పటి్కే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పాటు జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై వారితో చర్చించారు. ఇక తన ఢిల్లీ పర్యటనలో అత్యంత కీలకంగా భావిస్తున్న ప్రధానితో భేటీని కూడా కేసీఆర్ దిగ్విజయంగా ముగించారు. శనివారం రాత్రి అరగంట పాటు సాగిన భేటీలో మోదీ ముందు కేసీఆర్ చాలా అంశాలనే ప్రస్తావించారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రధానంగా ప్రస్తావించిన కేసీఆర్... వాటి విడుదలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మోదీని కోరారు. ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంపు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైదరాబాద్‌కు వరదసాయం, జీఎస్టీ బకాయిలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తదితర అంశాలనూ ఈ భేటీలో కేసీఆర్ ప్రస్తావించారు. పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సహకారం గురించి ప్రధానితో కేసీఆర్ చర్చించారు. కేసీఆర్ ప్రస్తావించిన విషయాలన్నింటినీ సావదానంగా విన్న మోదీ.. సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే... ప్రధాని మోదీతో భేటీకి ముందు కేసీఆర్ పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆరు డొమెస్టిక్ ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేయాలని కేసీఆర్ కోరారు. బసంత్ నగర్, మామునూరు, ఆదిలాబాద్, జక్రాన్ పల్లి, దేవరకద్ర, కొత్తగూడెంలో విమానాశ్రయాల ఏర్పాటు కోసం 2018లో ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. దీనికి సంబంధించి ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా సర్వే చేసిందని గుర్తు చేశారు. విమానాశ్రయాల ఏర్పాటు కోసం సింగిల్ విండో పద్ధతిలో అనుమతి ఇవ్వాలని కోరారు. సిద్దిపేటలో విమానాశ్రయం ఏర్పాటుపై చర్చించారు.