Begin typing your search above and press return to search.
మోడీకి కేసీఆర్ రహస్య మిత్రుడా?
By: Tupaki Desk | 4 Aug 2018 2:31 PM GMTఒక ముఖ్యమంత్రితో 45 నిమిషాల పాటు సమావేశం అవడం...అందులోనూ ఆయన మిత్రపక్షం కాదు. పోనీ పార్టీ పరంగా సదరు నాయకుడి ఏలుబడిలో ఉన్న రాష్ట్రంలో ఆశలు వదిలేసుకున్నారా అంటే అదీ లేదు.. ఆ రాష్ట్రంలో బలపడాలని..ఇంకా చెప్పాలంటే..భవిష్యత్తులో....వీలైతే వచ్చే ఎన్నికల్లోనే అధికారంలోకి వచ్చేయాలనేది టార్గెట్. అయినప్పటికీ...పార్టీకి ప్రత్యర్థి అయిన సీఎంతో ముప్పావు గంట సమావేశం అవడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే చెల్లింది. అలా ఆయనతో సుదీర్ఘ సమావేశం అయింది ఎవరంటే...తెలంగాణ సీఎం కేసీఆర్.
ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీల పరంపర కొనసాగిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్...తాజాగా మరోమారు ఢిల్లీలో మోడీజీతో సమావేశం అయ్యారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. సుమారు ముప్పావు గంట పైనే ఈ సమావేశం జరిగింది! కొత్త జోనల్ వ్యవస్థ - హైకోర్టు విభజన సహా పలు కీలక అంశాలపై చర్చించారు. హైకోర్టు విభజన - కాళేశ్వరానికి ఆర్థిక సాయం - రక్షణ భూముల కేటాయింపు సహా 11 అంశాలపై సీఎం కేసీఆర్ మోడీకీ వినతి పత్రాలు అందజేశారు. జిల్లాకో నవోదయ విద్యాలయం ఏర్పాటు, వేగంగా కొత్త రైల్వేలైన్ల నిర్మాణంపైనా విజ్ఞప్తి చేశారు. విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీని కోరారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
ప్రధానితో సమావేశం సమయంలో సీఎం వెంట రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు. అనంతరం వారు వెలుపలికి వచ్చేయగా... ప్రధాని మోడీ - సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా ఏకాంతంగా చర్చించుకున్నారు. ఈ రహస్య - వ్యక్తిగత సమావేశం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అనే చర్చ జరుగుతోంది. ఓ వైపు ఫెడరల్ ఫ్రంట్ గళం వినిపిస్తున్న కేసీఆర్...ప్రతిపక్ష పార్టీలు నిర్వహిస్తున్న సమావేశాలకు దూరంగా ఉండటం, వారితో సమావేశం అవకపోవడం....అదే సమయంలో మోడీని తరచుగా కలుస్తుండటం చూస్తుంటే...మోడీకి కేసీఆర్ రహస్య మిత్రుడా? అనే చర్చ సహజంగానే తెరమీదకు వస్తోంది.