Begin typing your search above and press return to search.
బహిష్కరణలపై గవర్నర్ కు కేసీఆర్ వివరణ?
By: Tupaki Desk | 16 July 2018 6:58 AM GMTఈరోజు వార్తా పత్రికల్ని క్షుణ్ణంగా చూసే వారికో ఆసక్తికర వార్త ఒకటి కనిపిస్తుంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఒక ముఖ్యమంత్రి తరచూ రాష్ట్ర గవర్నర్ వద్దకు వెళ్లటం.. గంటల తరబడి మాట్లాడుకోవటం కనిపించదు. ఇలాంటి సీన్ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కనిపిస్తూ ఉంటుంది.
సచివాలయానికి ఆర్నెల్లకు ఒకసారి కూడా రాని ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ కు మాత్రం ప్రతి పది.. పదిహేను రోజులకో మారు వెళ్లటం.. తాను తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాల్ని ఆయనకు చెప్పినట్లుగా ప్రెస్ నోట్ రూపంలో మీడియా సంస్థలకు సమాచారం అందుతుంటుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో.. వీలైనంతవరకూ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రెస్ నోట్లను యథావిధిగా కొట్టేసి పంపటమో.. కాస్తంత మార్పులు చేర్పులు చేసి ఎత్తి రాయటమో కానీ.. ఎందుకు? ఏమిటి? లాంటి ప్రాధమికమైన ప్రశ్నల్ని వేసుకొని విశ్లేషణ చేసే పరిస్థితి దాదాపుగా తగ్గిపోయిందని చెప్పాలి.
ఒక రాష్ట్ర గవర్నర్ ను ఒక ముఖ్యమంత్రి తరచూ ఎందుకు కలుస్తుంటారు? దేశంలో ఎక్కడా కనిపించని ఈ సీన్ తెలంగాణలోనే ఎందుకు కనిపిస్తూ ఉంటుంది? గవర్నర్ నరసింహన్ కు కేసీఆర్ ఎందుకంత ప్రాధాన్యత ఇస్తుంటారు? హైదరాబాద్ మహానగరానికి వచ్చే తోపుల్లాంటి వీవీఐపీలను కలుసుకునేందుకు సైతం పెద్దగా ఆసక్తి ప్రదర్శించని కేసీఆర్.. గవర్నర్ ను మాత్రం ఠంచన్ గా ఎందుకు కలుస్తున్నట్లు? లాంటి ప్రశ్నలు ఎన్నో వస్తాయి. కానీ.. వాటికి సమాధానాలు మాత్రం లభించవు.
తాజా భేటీనే చూస్తే.. ఇటీవల హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరణ వేటు వేసిన స్వామి పరిపూర్ణానంద.. కత్తి మహేశ్ లను ఎందుకు బహిష్కరించాల్సి వచ్చిందో గవర్నర్ కు సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకే వేటు వేసినట్లుగా కేసీఆర్ చెప్పుకోవటం కనిపిస్తుంది.
రైతు బీమా పథకం.. దాని ఉద్దేశాన్ని కూడా గవర్నర్ కు వివరించినట్లుగా చెబుతూ.. పాలనా పరమైన మరిన్ని అంశాలపై కూడా గవర్నర్ తో ముచ్చటించినట్లుగా పేర్కొన్నారు.
స్వామి పరిపూర్ణానంద.. కత్తి మహేశ్ లు ఇద్దరు శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు.. పర్యవసానాలపై మాట్లాడుకున్నట్లుగా చెప్పటంతో పాటు.. ఈ ఎపిసోడ్ పై వార్తా ఛానల్స్ వ్యవహరించిన తీరుపైనా కేసీఆర్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా కూడా వార్తలో పేర్కొన్నారు. తానేం అనుకుంటున్న విషయాన్ని నేరుగా చెప్పే కన్నా.. గవర్నర్ తో చెప్పిన మాటలతో చెప్పనే తన సందేశాన్ని కేసీఆర్ ఇచ్చేస్తున్నారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏమైనా.. గవర్నర్ కు ఇద్దరు ప్రముఖులు (?) నగర బహిష్కరణ విషయంపైనా గవర్నర్ కు కేసీఆర్ వివరణ ఇచ్చుడేందో..?