Begin typing your search above and press return to search.
పీకేను కేసీఆర్ వాడేస్తున్న వైనం తెలిస్తే అవాక్కేనట
By: Tupaki Desk | 26 April 2022 11:30 AM GMTపోల్ మేనేజ్ మెంట్ అన్న మాట విన్నంతనే మొన్నటి వరకు గుర్తుకు వచ్చేది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే. బలాన్ని ఆయుధంగా వాడటం.. దౌర్జన్యంతో తాము అనుకున్న పనిని పూర్తి చేయటమే తప్పించి.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. జనాలను తనకు అనుకూలంగా మార్చుకునే పోల్ మేనేజ్ మెంట్ అన్నది ఒకటి ఉంటుందన్న విషయాన్ని తెలుగు ప్రజలకు పెద్దగా తెలీని వేళ.. దాన్ని వాడేసి తాను అనుకున్న ఫలితాన్ని తెచ్చుకోవటంలో మొనగాడు చంద్రబాబు. ఆ తర్వాత ఆయన టెక్నిక్ ను అర్థం చేసుకోవటం.. ఆయన సక్సెస్ మంత్రను డీ కోడ్ చేయటంతో ఆయన విజయపరంపర ఆగిపోవటం.. వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగలటం షురూ అయ్యింది.
చంద్రబాబు తర్వాత పోల్ మేనేజ్ మెంట్ కు మొనగాడు ఎవరంటే.. తెలుగు రాష్ట్రాల వరకు వస్తే మాత్రం.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారు. ఎన్నిక ఏదైనా సరే.. తనకు అనుకూలంగా ఫలితాన్ని తెచ్చుకునేలా చేయటంతో ఆయనకు ఆయనే సాటి. ఎప్పటికప్పుడు ఉప ఎన్నికల్ని తీసుకురావటం.. రాజకీయ పరిణామాల్ని తనకు అనుకూలంగా మార్చుకోవటం ద్వారా.. తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు వేయటం మొదలు.. తెలంగాణ రాష్ట్ర సాధన వేళ.. ఆ తర్వాత అధికారంలో ఉన్న వేళలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ తనదే పైచేయి ఉండేలా చేసుకోవటంతో కేసీఆర్ ను వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఈ మధ్యన జరిగిన రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లోనూ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఆయన ప్లానింగ్ వర్కువుట్ కాలేదని చెప్పాలి.
అయితే..ఈ మూడు సందర్భాల్లోనూ చేయాల్సిన దాని కంటే ఎక్కువ చేయటమే కేసీఆర్ కు పెద్ద మైనస్ గా చెబుతారు. ఎక్కడిదాకానో ఎందుకు తనకు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఈటల రాజేందర్ రాజీనామా చేసే పరిస్థితి తీసుకురావటం.. ఉప ఎన్నికల్లో ఆయన్ను ఓడించేందుకు వేసిన ఎత్తులన్ని రివర్సులో ఎదురుదెబ్బ తగిలేలా చేశాయి. ఈ సందర్భంగా ఆయన రచించిన వ్యూహాలేమీ వర్కువుట్ కాలేదు. ఇవి మినహా.. ఆయన ఎన్నికల వ్యూహాలకు ఎదురుదెబ్బలు తగిలింది లేదు.
అలాంటప్పుడు ఎన్నికల వ్యూహాల్లో మాస్టర్ ప్లాన్లు వేసే కేసీఆర్ కు పీకే అవసరం ఎందుకు వచ్చింది? ఆయన టీం చెప్పే ఎన్నికల వ్యూహాలు కేసీఆర్ కు రావా? అంటే.. ఎందుకు రావు అని ఎవరైనా చెబుతారు. మరి.. అలాంటప్పుడు కోట్లు తగలేసి పీకే సంస్థ సేవల్ని ఎందుకు తీసుకుంటున్నట్లు? అంటే.. అక్కడే ఉంది అసలు విషయమంతా అని అంటున్నారు.
జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని తపిస్తున్న కేసీఆర్ కు ఇప్పుడు ఏకైక ప్రత్యర్థి నరేంద్ర మోడీనే. ఆయనలాంటి బలమైన ప్రజాకర్షణ ఉన్న నేతను దెబ్బేయటం ద్వారా తన స్థాయిని మరింత పెంచుకోవాలన్న ఆసక్తి గులాబీ బాస్ లో ఎక్కువే. జాతీయ స్థాయిలో రాణించాలన్నా.. అక్కడ చక్రం తిప్పాలన్నా.. అందుకు కేసీఆర్ బలం ఏ మాత్రం సరిపోదు. ఎందుకంటే.. తెలంగాణలో పక్కన పెడితే.. ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్ కు అంత మంచి పేరు లేదనే చెబుతారు. ఇతర ప్రాంతీయ పార్టీల వారు కేసీఆర్ ను నమ్మకమైన మిత్రుడిగా పరిగణలోకి తీసుకోరని చెబుతారు. ఈ ప్రతిబంధకాన్ని అధిగమించేందుకు వీలుగానే పీకే సేవల్ని తీసుకుంటున్నారని చెబుతున్నారు.
కేసీఆర్ తో పోలిస్తే.. పీకేకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న పట్టు అంతా ఇంతా కాదు. బీహార్.. పశ్చిమ బెంగాల్.. కర్ణాటక.. తమిళనాడు.. ఏపీ.. ఇలా చెప్పుకుంటూ పోతే పలు రాష్ట్రాల్లో పీకేకు.. ఇతర రాజకీయ పార్టీల అధినేతలకు ఉన్న సంబంధాలు రానున్న రోజుల్లో ఉపయోగించుకోవటానికి వీలుగా ముందస్తుగానే పీకేను తన వర్గంలోకి డీల్ రూపంలోకి తీసుకున్నారని చెబుతున్నారు. పీకే మాస్టర్ మైండ్ తో ఇతర రాష్ట్రాలకు చెందిన అధినేతలతో ఈజీ యాక్సిస్ కోసం ఇప్పు్డీ డీల్ ముచ్చట తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. అంతే తప్పించి కేసీఆర్ కు పొలిటికల్ స్ట్రాటజీలు తగ్గి కాదు..వ్యూహాత్మకంగానే పీకేతో కేసీఆర్ డీల్ కుదుర్చుకున్నారని చెప్పక తప్పదు.