Begin typing your search above and press return to search.
ఇష్టారాజ్యంగా నీటిని తోడే కేసీఆర్.. ‘జాతీయ’ నీతులు చెప్పటమా?
By: Tupaki Desk | 13 Jun 2022 3:29 AM GMTతెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం ద్వారా యావత్ తెలంగాణ ప్రజల బతుకుల్ని మార్చేయటంతో పాటు.. తెలంగాణను బంగారు తెలంగాణలా మార్చే సుదీర్ఘ స్వప్నాన్ని సాధించేసినట్లుగా భావిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు ఫోకస్ మొత్తం జాతీయ రాజకీయాల మీద పెట్టటంతో పాటు.. ఒక పార్టీని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఏపీ డెవలప్ మెంట్ గురించి కూడా టీఆర్ఎస్ మంత్రులు గొంతు విప్పుతున్నారు.
ఏపీ ప్రయోజనాల కోసం కోట్లాడేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. దీనంతటికి ముందు.. ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిల మాటేంటి? అన్నది ఒక ప్రశ్న. అంతే కాదు.. క్రిష్ణా జలాల్ని ఒప్పందం ప్రకారం వాడటం మానేసి.. నచ్చిన రీతిలో తోడేస్తున్న వైనంపై కేసీఆర్ మాటేంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఏపీ ప్రయోజనాల్ని తీవ్రంగా దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్న వైనంపై ఏపీ ప్రభుత్వం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.
గత ఏడాది అవసరం లేకున్నా శ్రీశైలం.. నాగార్జున సాగర్.. పులిచింతలలో నీటి నిల్వ కనీస మట్టం కంటే దిగువన ఉన్నప్పుడే ఎడమ గట్టు కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేసి.. రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన జలాల్ని ప్రకాశం బ్యారేజీ ద్వారా వేస్టు చేసి.. సముద్రం పాటు చేయటం తెలిసిందే. తాజాగా కూడా అదే తీరును తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శిస్తుందని చెబుతన్నారు.
క్రిష్ణా బోర్డు నుంచి అనుమతి తీసుకొన్న తర్వాతనే శ్రీశైలంలోకి వచ్చిన ప్రవాహాన్ని తరలించటానికి వీలు ఉంటుంది. అందుకు భిన్నంగా బోర్డు నుంచి అమనుతి తీసుకోకుండానే శ్రీశైలంలోకి వచ్చిన ప్రవాహాన్ని కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తరలిస్తున్న పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వ తీరును క్రిష్ణా బోర్డుకు ఏపీ ఇరిగేషన్ అధికారులు కంప్లైంట్ చేశారు. ఏపీలోని గుంటూరు.. ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదలను తెలంగాణ ప్రభుత్వం ఆపేసి.. నిబంధనలకు విరుద్ధంగా ఏఎమ్మార్పీ ద్వారా యథేచ్ఛగా నీటిని తరలిస్తున్న పరిస్థితి నెలకొంది.
అదే సమయంలో ప్రకాశం.. గుంటూరు జిల్లాల తాగు.. సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని లేఖ రాసినా ప్రయోజనం లేకుండా పోతోంది. దీనికి కారణం.. సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ తెలంగాణ ప్రభుత్వ అధీనంలో ఉండటమే. ఏపీకి అవసరమైన నీటిని విడుదల చేయటానికి చేతులు రాని కేసీఆర్ సర్కారు.. మరోవైపు క్రిష్ణా బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే భారీ ఎత్తున నీటిని తెలంగాణలోకి తరలించుకుపోతోంది.
జూన్ 1 - 3 వరకు 4218 క్యూసెక్కుల నీటిని తరలిస్తే.. 6 - 11 వరకు ఏకంగా 4100 (దగ్గర దగ్గర) క్యూసెక్కుల నీటిని తెలంగాణ తరలించింది. దీనిపై ఏపీకి చెందిన ఇరిగేషన్ అధికారులు క్రిష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశారు. జాతీయపార్టీని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉండి.. కేంద్రంలో చక్రం తిప్పాలని తెగ ఆత్రపడుతున్న కేసీఆర్.. తమ సోదర రాష్ట్రం విషయంలోనే ధర్మంగా ఉండకపోవటం ఏమిటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.