Begin typing your search above and press return to search.
నల్లగొండ ఉప ఎన్నిక వస్తే టీఆర్ఎస్ మెజార్టీ ఎంత?
By: Tupaki Desk | 18 March 2018 2:30 PM GMTతెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ శాసనసభ సభ్యత్వం రద్దుతో ఉపఎన్నికలు రావొచ్చనే సంకేతాలు వస్తున్నాయి.అన్ని పార్టీలు 2019 సాధారణ ఎన్నికలకు రెడీ అవుతున్న ఈ టైమ్ లో ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చర్చనీయాంశమైంది. ఈ రెండు చోట్ల ఉపఎన్నిక తప్పదా అనేది హాట్ టాపిక్ అయ్యింది. సాధారణ ఎన్నికలకు ఏడాదే సమయం ఉంది. కానీ ఇప్పటికే రెండు సీట్లు ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యాలయం ప్రకటించింది. ఈ విషయాన్ని ఈసీకి తెలిపింది.
అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి రాజ్యాంగం ప్రకారం స్పీకర్ దే తుది నిర్ణయం. కోమటిరెడ్డి, సంపత్ కుమార్ ల విషయంలో స్పీకరే స్వయంగా తీసుకున్న డెసిషనే ఫైనల్ అవుతుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. గతంలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలో ఇలాంటి ఘటనల విషయంలో స్పీకర్ నిర్ణయమే ఫైనల్ అయ్యింది. ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నికలు తప్పవనే ప్రచారం జరుగుతోంది. రెండు స్థానాలకు ఉప ఎన్నిక ఖాయమని భావిస్తున్న టీఆర్ఎస్ పార్టీ.. ఆయా స్థానాల్లో గెలుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నల్లగొండ బైపోల్‌ను సీరియస్‌గా తీసుకున్న సీఎం కేసీఆర్.. అక్కడ పట్టు సాధించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. జిల్లాకు చెందిన ముఖ్య నాయకులను పిలిపించుకుని ఎన్నికల వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది.
కాగా, ఈ చర్చల్లో తాను చేయించిన సర్వేలో నల్లగొండ ఉప ఎన్నికలో 25000 ఓట్ల మెజార్టీతో గెలుపు ఖాయమని గులాబీ దళపతి కేసీఆర్ పార్టీ నేతలతో చెప్పినట్లు సమాచారం. కోమటిరెడ్డి పట్ల నియోజకవర్గంలో అంత సానుకూలత లేదని, టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ అన్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే రాష్ట్రంలో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో మరోసారి ఉపఎన్నికలు రావడం ఖాయమని ఇటు అధికార, అటు ప్రతిపక్ష పార్టీలు నమ్ముతుండటం గమనార్హం.