Begin typing your search above and press return to search.

చీర‌ల కాల్చుడు వెనుక ఉన్న‌ది వారేనా?

By:  Tupaki Desk   |   20 Sep 2017 5:48 AM GMT
చీర‌ల కాల్చుడు వెనుక ఉన్న‌ది వారేనా?
X
బ‌తుక‌మ్మ చీర‌ల పేరిట తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు ఇస్తున్న చీర‌ల నాణ్య‌త బాగోలేదంటూ ప‌లువురు మ‌హిళ‌లు నిర‌స‌న వ్య‌క్తం చేస్తుంటే.. మ‌రికొంద‌రు ఈ చీర‌ల్ని కాల్చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కోటి మందికి పైగా మ‌హిళ‌ల‌కు చీర‌ల పంపిణీ ద్వారా భారీ ఇమేజ్ ను ఆశించిన కేసీఆర్ స‌ర్కారుకు చీర‌ల నాణ్య‌త‌పై వెల్లువెత్తుతున్న నిర‌స‌న‌లు మంట పుట్టిస్తున్నాయి.

బ‌హుమానంగా ఇచ్చిన చీర‌ల్ని కాల్చివేయ‌టంపై టీఆర్ఎస్ నేత‌ల్లో అంత‌ర్మ‌ధ‌నం మొద‌లైంది. అన‌వ‌స‌రంగా చీర‌ల వ్య‌వ‌హారాన్ని నెత్తిన వేసుకున్నామా? అన్న సందేహాన్ని వ్య‌క్తం చేస్తున్న వారు లేక‌పోలేదు. చీర‌ల నిర‌స‌న‌పై పార్టీలో నెల‌కొన్న గంద‌ర‌గోళాన్ని సరిదిద్దేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌యంగా రంగంలోకి దిగారు. ప‌లువురు జిల్లా నేత‌ల‌తో మాట్లాడిన ఆయ‌న‌.. వారి జిల్లాల్లో చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న తీరుతెన్నుల్ని అడిగి తెలుసుకున్నారు. అదే స‌మ‌యంలో నిర‌స‌న‌ల మీద అన‌వ‌స‌రంగా ఫోక‌స్ పెట్టొద్ద‌న్న మాట‌ను ఆయ‌న.. అదంతా విప‌క్షాల కుట్ర‌గా అభివ‌ర్ణించారు.

చీర‌ల పంపిణీని అడ్డుకునే ప్ర‌తిప‌క్ష పార్టీలు రాజ‌కీయంగా దెబ్బ తింటాయ‌ని.. ఎన్ని చీర‌లు త‌గ‌ల‌బెడితే అంత‌గా న‌ష్ట‌పోతార‌న్న మాట‌ను కేసీఆర్ చెప్పారు. చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేని రీతిలో చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వం చేప‌ట్టింద‌ని.. ఏదో ఒక‌ట్రెండు ప్రాంతాల్లో మిన‌హా మిగిలిన అన్ని చోట్లా చీర‌ల పంపిణీ బాగానే సాగుతుంద‌ని చెప్పారు. విప‌క్షాల విమ‌ర్శ‌ల్ని లైట్ తీసుకోవాల‌ని.. అనుకున్న గ‌డువు లోప‌ల చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేయాల‌న్న మాట‌ను నేత‌ల‌కు కేసీఆర్ చెప్పారు. చీర‌ల కోసం క్యూలో నిలుచున్న మ‌హిళ‌ల‌ను ఎక్కువ‌సేపు నిలుచునేలా చేయొద్ద‌న్న సూచ‌న‌ను కేసీఆర్ చేశారు.

ఇదిలా ఉంటే.. చీర‌ల పంపిణీపై ఫీడ్ బ్యాక్‌ను టీఆర్ఎస్ నేత‌ల నుంచి కేసీఆర్ సేక‌రిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. విప‌క్షాల తీరును ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. చీర‌ల నాణ్య‌త లేక‌పోతే మ‌హిళ‌లు ప‌క్క‌న పెట్టేస్తారే కానీ వాటిని త‌గ‌ల‌బెట్ట‌ర‌ని.. అలాంటి ప‌నులు రాజ‌కీయంగా దెబ్బ తీయ‌టానికి త‌ప్ప మ‌రింకేమీ లేద‌న్న మాట కేసీఆర్ చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. ఇళ్ల‌ల్లోఏదైనా శుభ‌కార్యాలు జ‌రిగిన‌ప్పుడు పెట్టుబ‌డి కింద చౌక‌లో వ‌చ్చే చీర‌ల్ని బ‌హుమ‌తిగా ఇవ్వ‌టం ఎప్ప‌టి నుంచో ఉంద‌ని.. ఒక‌వేళ న‌చ్చితే ఆ చీర‌ల్ని క‌ట్టుకుంటార‌ని.. లేకుంటే ఎవ‌రికైనా బ‌హుమానంగా ఇస్తారే కానీ ఇలా త‌గ‌ల‌బెట్ట‌ర‌న్న మాట ప‌లువురు టీఆర్ఎస్ నేత‌ల నోట వినిపిస్తోంది. చీర‌ల్ని త‌గ‌ల‌బెట్టే కార్య‌క్ర‌మం వెనుక రాజ‌కీయ పార్టీల పాత్ర‌ త‌ప్ప‌నిస‌రి అన్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో చీర‌ల కాల్చుడి వ్య‌వ‌హారాల్ని లైట్ తీసుకోవాల‌న్న మాట‌ను కేసీఆర్ చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.