Begin typing your search above and press return to search.

ష‌ర్మిల‌తో 'కేటీఆర్' పాద‌యాత్ర చేయాలి.. ఎందుకంటే..

By:  Tupaki Desk   |   16 April 2022 3:06 AM GMT
ష‌ర్మిల‌తో కేటీఆర్ పాద‌యాత్ర చేయాలి.. ఎందుకంటే..
X
అదేంటి? అనుకుంటున్నారా? రెండు ప‌ర‌స్ప‌ర భిన్న‌దృవాలు క‌లిసి.. పాద‌యాత్ర చేయ‌డం ఏంటి? అని చ‌ర్చించుకుంటున్నారా? ఆశ్చ‌ర్యానికి కూడా గుర‌వుతున్నారా? ఇక్క‌డే ఉంది అస‌లు విష‌యం. ఎందుకంటే.. తెలంగాణ ఉద్య‌మం చేసింది ఎవ‌రు? రాష్ట్రాన్ని సాధించింది ఎవ‌రు? అస‌లు రాష్ట్రం కోసం.. పోలీసుల కేసులు.. కోర్టుల నుంచి తీర్పులు ఎదుర్కొన్న‌ది ఎవ‌రు? ఇలా.. చూసుకుం టే.. అన్ని వేళ్లూ.. కేసీఆర్‌వైపు చూపుతున్నాయి. ఇక‌, రాష్ట్రం ఇవ్వ‌డంలో కాంగ్రెస్ ముందుంది. ఇక‌, పార్ల‌మెంటులో కేసీఆర్ తో గ‌ళం క‌లిపింది.. బీజేపీ. అంటే.. కేసీఆర్ ప్ర‌య‌త్నిస్తే.. కాంగ్రెస్ ఇచ్చింది. దీనికి బీజేపీ స‌హ‌క‌రించింది.

అంటే.. మొత్తంగా మూడు పార్టీల స‌మాహారం.. స‌మ‌న్వ‌యంతో తెలంగాణ ఏర్ప‌డింది. అయితే.. ఇప్పుడు తెలంగాణ కోసం.. క‌న్నీరు పెట్టుకుంటున్న‌..(విమ‌ర్శ‌కులు మాత్రం మొస‌లి క‌న్నారు అంటున్నారు) ష‌ర్మిల‌క్క‌.. కేసీఆర్ రాష్ట్రాన్ని నాశ‌నం చేస్తున్నాడ‌ని విమ‌ర్శ‌లు తెగ గుప్పించేస్తున్న ష‌ర్మిల‌క్క‌.. రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు అన్యాయం జ‌రిగిపోతోంద‌ని.. నోరేసుకుంటున్న ష‌ర్మిల‌క్క‌.. అప్పుడు ఏం చేసింది? ఎక్క‌డ ఉంది? ఎలా పోరాడింది? ఎవ‌రికోసంపోరాడింది? అనే విష‌యాల‌ను మేధావులు తెర‌మీదికి తెస్తున్నారు.

ఎందుకంటే.. ఇటీవ‌ల కాలంలో కేసీఆర్ స‌ర్కారుపైనా.. కాంగ్రెస్‌పైనా.. బీజేపీపైనా.. ష‌ర్మిల‌క్క అన‌రాని మాట‌ల‌న్నీ అనేస్తున్నారు. తెలంగాణ స‌మాజాన్ని ఉద్ధ‌రించే ఝాన్సీ ల‌క్ష్మీబాయి తానేన‌ని చెప్పుకొనేస్తున్నారు. దీంతో ఒక్క‌సారిగా మేధావుల మెద‌ళ్లు కూడా మొద్దు బారిపోయాయి. ``అర‌రె.. ష‌ర్మిల‌క్క‌.. గ‌ప్పుడు ఏం చేసింద‌ర‌బ‌య్‌!`` అని నోరు వెళ్ల‌బెడుతున్నారు. ఎందుకంటే.. ఖ‌చ్చితంగా 8 ఏళ్ల కింద‌ట‌... తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డ‌డానికి ముందు.. ఇదే ష‌ర్మిల‌క్క‌.. తెలంగాణ వ‌ద్ద‌ని క‌య్యం పెట్టుకోలేదా.. ప్ర‌త్యేక పాద‌యాత్ర‌లు చేయ‌లేదా.. ``ఉమ్మ‌డి ముద్దు.. విభ‌జ‌న వ‌ద్దు..`` అని ఊరూరు తిరిగి.. ఉలికి ప్ర‌చారం చేయ‌లేదా? అని గ‌తంలోకి జారుకుని.. జ‌ర‌.. నెర‌మేరుసుకుంటున్రు!!

ఒక్క‌సారి ఎనిమిదేళ్ల నాటి చ‌రిత్ర చూస్తే.. గీ ఝాన్సీ ల‌క్ష్మీబాయి.. రాణీ రుద్ర‌మ‌దేవి.. చేసిందేంటి? తెలంగాణ వ‌ద్దంటూ.. ఉమ్మ‌డి రాష్ట్రం ముద్దంటూ.. రాజ‌కీయాలు చేసింది. ఉమ్మ‌డి ఏపీ కోసం.. అలుపెరుగని పాద‌యాత్ర చేసి.. తెలంగాణ కు వ్య‌తిరేకంగా.. చ‌క్రం తిప్పిన సంగ‌తి ఎరికెనా? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఖాళీగా ఉన్న‌ప్పుడు.. బెంగ‌ళూరులో ఉంది. త‌ర్వాత‌.. అన్న‌గారి కోసం.. ఏపీలో రాజ‌కీయం వెల‌గ‌బెట్టింది. అక్క‌డ త‌న్ని త‌రిమేసినంత ప‌నిచేస్తే.. ఎక్క‌డో ఒక చోట ఏదో ఒక‌టి చెప్పుకొని బ‌తికేద్దామ‌ని.. చెట్టు పేరు చెప్పుకొంటూ.. చెడామ‌డా నోటికి వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే.. చ‌రిత్ర మ‌రిచిపోతుందా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

చేసిందంతా చేసేసి.. ఇప్పుడు తెలంగాణ ప్ర‌జ‌ల గురించి.. ఇక్క‌డి స‌మాజం గురించి.. కేసీఆర్‌ని, కేటీఆర్‌ని.. రేవంత్‌రెడ్డిని.. బీజేపీ నేత‌ల‌ను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్ట‌డం అంటే.. గ‌తాన్నిమ‌రిచిపోయి.. ఉమ్మ‌డి కోసం.. ఊపిరి స‌ల‌ప‌ని పోరు చేసిన సంగ‌తి ప‌క్క‌న పెట్టి.. వ్య‌వ‌హ‌రించ‌డమేన‌ని.. మేదావులు అంటున్నారు. అంతేకాదు.. ఇదంతా కూడా దెయ్యాలు వేదాలువ‌ల్లించిన‌ట్టేన‌ని చెబుతున్నారు. తెలంగాణ కోసం.. మీరు ఏం చేశారు? అంటే నీళ్లు న‌మిలే ప‌రిస్థితిలో ఉన్న ష‌ర్మిల‌.. ఇప్పుడు ఉద్ధ‌ర‌ణ తెలంగాణ కోస‌మా.. త‌న కోస‌మా? అనేది చెప్పాల్సి ఉంద‌ని అంటున్నారు. ఏదేమైనా.. ష‌ర్మిల చేస్తున్న పాద‌యాత్ర‌.. పాడు యాత్రే.. మ‌రొక‌టి కాద‌ని.. తేల్చి చెబుతున్నారు.