Begin typing your search above and press return to search.
మాస్క్ పెట్టరు సరే.. వేలిని నోట్లో పెట్టే తీరేంది సారూ?
By: Tupaki Desk | 6 May 2020 4:30 AM GMTఅందరి కళ్లకు కాయలు కాచేలా చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. మంగళవారం ఆయన ప్రెస్ మీట్ ఉంటుందన్న నేపథ్యంలో.. సాయంత్రం నుంచి సారు ఇంటర్వ్యూ కోసం చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఎట్టకేలకు రాత్రి తొమ్మిదిన్నర సమయంలో కేసీఆర్ ప్రెస్ మీట్ షురూ అయ్యింది. అది ఏకంగా పదకొండు వరకూ సాగింది. అప్పటికి కేసీఆర్ ఆపితే ఆగిందే తప్పించి..సారు మాట్లాడుతుంటే అదే పనిగా వింటూ మంత్రించినట్లుగా ఉండిపోయేలా చేసిన టాలెంట్ ఆయన సొంతంగా చెప్పాలి.
ప్రెస్ మీట్ వేళ.. సీఎం కేసీఆర్ మాట్లాడటానికి కాస్త ముందు.. మధ్యలో ఒకట్రెండుసార్లు.. చివర్లో మరోసారి కెమేరా ఫ్రేంను కాస్త పక్కకు జరిపినప్పుడు మంత్రులు కనిపించారు. ఈ సందర్భంగా వారంతా ముఖానికి మాస్కులు పెట్టుకొని ఉన్నారు. వారందరికి భిన్నంగా సీఎం కేసీఆర్ మాత్రం ముఖానికి మాస్కు పెట్టుకునే ప్రయత్నం చేయలేదు. కాకుంటే.. తాను ముఖానికి మాస్కు పెట్టుకుంటానని మాట వరసకు చెప్పుకున్నారు.
ఇప్పుడున్న వేళలో.. మాస్కు లేనిది కిరాణం మొదలు ఏ షాపుల్లోకి అనుమతించొద్దని చెప్పే ముఖ్యమంత్రి.. తనకు తాను మాత్రం మాస్కులు ధరించని విచిత్రం కనిపిస్తుంది. ప్రధాని మోడీ సైతం.. ముఖానికి ప్రత్యేకమైన క్లాత్ ను మాస్కు రూపంలో కట్టేసుకోవటం తెలిసిందే. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తూ.. ప్రధాని మాదిరి ముఖానికి ఇంట్లో ఉండే టవల్.. కర్చీఫ్ తో కట్టుకోవచ్చన్నారు.
ఇదొక అంశమైతే.. మరో డేంజరస్ పనిని అదే పనిగా చేస్తున్నారు కేసీఆర్. తన ముందున్న పేపర్లను వరుస పెట్టి చదువుతూ.. వాటిని పక్కకు పెట్టి.. కొత్త పేపర్లు చూసే క్రమంలో కేసీఆర్ చేతి వేలి.. నాలికకు తాకటం కనిపిస్తుంది. కరోనా వేళ.. ఇలాంటి అలవాటు మహా డేంజరస్. నోట్లో తడిని వేలికి రాసుకొని.. దాంతో పేపర్లను పక్కకు జరిపే అలవాటు చాలా ప్రమాదకరమన్నది మర్చిపోకూడదు. ఇలాంటి చిన్న విషయాల్ని కేసీఆర్ ఎందుకని సీరియస్ గా తీసుకోరు?