Begin typing your search above and press return to search.

టి ఎమ్మెల్యే జీతం కంటే ఏపీ సీఎం జీతమే తక్కువ

By:  Tupaki Desk   |   10 Aug 2016 6:08 PM GMT
టి ఎమ్మెల్యే జీతం కంటే ఏపీ సీఎం జీతమే తక్కువ
X
వారిద్దరూ ముఖ్యమంత్రులు. హోదా ఒక్కటే అయినా.. జీతాలు మాత్రం తక్కువగా ఉండటం గమనార్హం. నమ్మటానికి కాస్త కష్టంగా ఉన్నా.. ఇది నిజమని చెప్పక తప్పుదు. విభజన కారణంగా ఏపీ ఎంత నష్టపోయింది? తెలంగాణ ఎంత లాభపడిందన్న విషయాన్ని పోల్చి చెప్పే క్రమంలో కొందరు చెబుతున్న ఉదాహరణ ఇప్పుడు పలువురిని ఆకర్షిస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన ఇద్దరు చంద్రుళ్లకు.. వారి సర్కారులోని ఎమ్మెల్యేలకు మధ్యనున్న జీతాల వ్యత్యాసం భారీగా ఉండటం గమనార్హం. వాస్తవానికి తెలంగాణతో పోలిస్తే.. ఏపీ జనాభా పరంగా పెద్ద రాష్ట్రం. అయినప్పటికీ జీతాల విషయానికి వచ్చేసరికి మాత్రం ఇద్దరి ముఖ్యమంత్రుల మధ్య అంతరం సగానికి సగంగా ఉండటం విశేషం. విభజన నేపథ్యంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఏపీలో ఎమ్మెల్యేలు.. ముఖ్యమంత్రి జీతం తక్కువ కాగా.. ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణలో మాత్రం సీన్ అందుకు భిన్నంగా ఉంది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నెలసరి జీతం సుమారు రూ.2.40లక్షలుగా ఉండగా.. ఏపీ లోని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి నెలసరి జీతం రూ.1.25లక్షలు మాత్రమే.అదే సమయంలో తెలంగాణలోని ముఖ్యమంత్రి కేసీఆర్ జీతం సుమారు రూ.4.21 లక్షలు కాగా.. తెలంగాణరాష్ట్రంలో ఎమ్మెల్యేల జీతం రూ.2.5లక్షలు. ఒక విధంగా చెప్పాలంటే.. తెలంగాణలో ఎమ్మెల్యే కంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జీతం తక్కువ అన్న మాట. దీనికి కారణం.. రాష్ట్రం ఆర్థికంగా చిక్కుల్లో ఉండటమేనని.. విభజన కారణంగా ఏపీకి ఆర్థికంగా ఎంత నష్టం వాటిల్లిందన్న విషయం ఈ పోలిక స్పష్టం చేస్తుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.