Begin typing your search above and press return to search.
కేసీఆర్ కలల ప్రాజెక్టు ఆగిపోయింది!
By: Tupaki Desk | 26 Nov 2016 6:25 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కలల ప్రాజెక్టు అయిన నూతన సచివాలయం వెనక్కు పోయింది. ప్రస్తుతం ఉన్న సచివాలయం వాస్తుకు అనుగుణంగా లేదన్న కారణంతో దాన్ని కూల్చివేసి అధునాతన హంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. అయితే సచివాలయం కూల్చివేత నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలపడం, పెద్ద నోట్ల రద్దు, ప్రతిపక్షాల విమర్శలు ఇందుకు కారణం అని తెలుస్తోంది.
రాష్ట్ర విభజనలో భాగంగా సచివాలయంలోని కొన్ని భవనాలను కేంద్రం ఏపీకి కేటాయించిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఏడాది పాటు హైదరాబాద్ నుంచే పాలన కొనసాగించింది. గత నాలుగు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో ఏపీ ప్రభుత్వం తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించి, తెలంగాణలోని ఏపీ సచివాలయంలో పని చేస్తున్న ఉన్నతాధికారులు సహా ఉద్యోగులందరినీ ఏపీకి తరలించింది. దీంతో ఖాళీ అయిన ఏపీ సచివాలయ భవనాలను తెలంగాణకు కేటాయించాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అందుకు ఏపీ ప్రభుత్వం కూడా మౌఖికంగా ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఏపీకి కేటాయించిన భవనాలను తిరిగి తెలంగాణకు కేటాయించాలంటూ తీర్మానం చేసింది. తీర్మానం ప్రతిని ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌కు అందజేసింది. సచివాలయాన్ని పూర్తిగా కూల్చివేసి దాని స్థానంలో సుమారు రూ.300 కోట్లతో కొత్త సచివాలయాన్ని నిర్మాణం చేపట్టాలని నిర్ణయించటం తెలిసిన సంగతే. సచివాలయం కూల్చివేతపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించడమే కాకుండా, కూల్చివేతపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై చర్చించిన ఏపీ మంత్రివర్గ ఉప సంఘం భవనాలను అప్పగించొద్దని సూచించింది. మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయం ప్రతిని సైతం గవర్నర్‌కు నరసింహన్‌కు అందజేసినట్టు సమాచారం.
పెద్ద నోట్ల రద్దు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వచ్చే నెల నుంచి ఇది మరింత తీవ్రతరం కాగలదనే ఉద్దేశంతోనే కొత్త సచివాలయం నిర్మాణ యోచన వెనక్కితీసుకుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఏపీ ప్రభుత్వం భవనాల అప్పగింతకు నిరాకరణ, కేంద్రం నుంచి సైతం వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు నోట్ల రద్దుతోనే నిర్మాణం నిలిపివేశారనే ప్రచారం చేస్తున్నట్లు సమాచారం.