Begin typing your search above and press return to search.
మోడీని రప్పిస్తా..కల నెరవేర్చుకుంటా అంటున్న కేసీఆర్
By: Tupaki Desk | 2 Nov 2017 3:30 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ పట్టు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తను అనుకుంటే అయిపోవాల్సిందే... విపక్షాలు.. మేధావులు అడ్డుపడ్డా..ఆయన తగ్గరు. పైగా దానికి కేసీఆర్ బలంగా నమ్మే వాస్తు తోడయితే...ఇక వెనక్కు తగ్గడం ఉండనే ఉండదు. అలా కేసీఆర్ మొండిపట్టుకు నిదర్శనంగా మారింది... కొత్త సచివాలయం నిర్మాణం. ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కొత్త సచివాలయం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్న కేసీఆర్...ఈ క్రమంలో కోర్టు కేసులను సైతం ఎదుర్కుంటున్నారు. తాజాగా ఆయన ఈ కాంక్షను నెరవేర్చుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని రంగంలోకి దింపుతున్నారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ కొత్త సచివాలయం గురించి చర్చ జరిగితే...కేసీఆర్ ఈ విషయం గురించి వివరిస్తూ...తన కల నెరవేర్చుకుంటానని...ఇందుకోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని రప్పిస్తా అని స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నూతన సచివాలయంపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. భారతదేశంలో 29 రాష్ర్టాలకు సచివాలయాలుంటే.. ఇంత పలికిమాలిన సచివాలయం ఏ రాష్ర్టానికి లేదన్నారు. ఇంత అడ్డదిడ్డమైన సచివాలయాన్ని ఎక్కడా చూడలేదన్నారు. ఏ బిల్డింగ్ కూడా నిబంధనలకు అనుగుణంగా లేదన్నారు. సెక్రటేరియట్‌లో సీఎం ఉండే సీ బ్లాక్ అధ్వానంగా ఉందన్నారు. ఇప్పుడున్న సచివాలయంలో ఫైరింజన్ వెళ్లి ఆపరేట్ చేసే స్థలం లేదన్నారు. సీ బ్లాక్ అయితే మరీ దారుణంగా ఉందన్నారు. ఇష్టం వచ్చిన రీతిలో సచివాలయాన్ని కట్టారని ధ్వజమెత్తారు. ఇప్పుడున్న సచివాలయంలో ఫైర్ సేఫ్టీ పూర్తిగా లోపించిందన్నారు. దేశంలో ఏ రాష్ర్టానికి వెళ్లినా అక్కడి సచివాలయం ఆ రాష్ట్ర గౌరవానికి ప్రతీకగా ఉంటుందన్నారు. మనం కూడా అలాగే నిర్మించుకోవాలని చెప్పారు. సచివాలయం - శాసనసభ - హెచ్ వోడీల కార్యాలయాలు కట్టాలనే ప్రతిపాదన ఉందన్నారు. మనం ఉన్న అసెంబ్లీ ఎలా ఉందని సీఎం అడిగారు. శాసనసభ నుంచి శాసనమండలికి వెళ్లాలంటే ఎలా వెళ్లాలి? అని ప్రశ్నించారు. అసెంబ్లీ పరిసరాల్లో పార్కింగ్ సౌకర్యాలే లేవన్నారు. ఈ కాంప్లెక్స్‌లన్నీ రూ. 500 కోట్లలోపే నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు.
ఇప్పుడు కట్టబోయే సచివాలయానికి రూ. 180 కోట్లకు మించి ఖర్చు కాదని కేసీఆర్ అన్నారు. ఇంకా విశాలంగా కట్టాలంటే రూ. 240 కోట్లకు మించి ఖర్చు కాదని స్పష్టం చేశారు. రాష్ర్టానికి సచివాలయం గొప్ప గౌరవ సూచకంగా ఉండాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు. కొత్త సచివాలయాన్ని కట్టి తీరుతామని.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. కొత్త సచివాలయ నిర్మాణం గురించి చెప్పినప్పుడు ప్రధాని మోడీ కూడా శుభాకాంక్షలు తెలిపారని సీఎం గుర్తు చేశారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రధాని నరేంద్రమోడీతో భూమిపూజ చేయిస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు చారిత్రక కట్టడాన్ని అందిస్తామన్నారు.
గతంలో కూడా నీలం సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి కూడా ఇప్పుడున్న సచివాలయాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. కానీ అది అమలు కాలేదన్నారు. తాను ఇప్పుడు ఏదో కొత్తగా చేస్తున్న ప్రతిపాదన కాదని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లాలంటే ఎన్ని వంపులు తిరుగాలో తెలియదన్నారు. కొత్త సచివాలయం నిర్మించగానే నగరం కాంక్రీట్ జంగిల్ అయిపోతదని సభ్యులు మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పుడున్న సచివాలయంలో ఫైల్స్ భద్రపరిచేందుకు స్థలం లేదు. కనీసం భోజనం చేసేందుకు కూడా సదుపాయాలు లేవని సీఎం తెలిపారు. రాష్ట్రం కోసం పని చేసే ఉన్నతాధికారులు హైదరాబాద్ లో 6 వేల మంది ఉంటారని చెప్పారు. ప్రధాన విభాగాలు విసిరేసినట్లు ఉన్నాయన్నారు. సమీక్షలకు పిలిస్తే ఫైల్ తీసుకురాలేదని అంటున్నారు.. మళ్లీ వెళ్లాలంటే ఎలా? అని ప్రశ్నించారు. కొత్తగా నిర్మించే సచివాలయాన్ని ఎలా వాడుకోవాలో.. అలా వాడుకుంటామని సీఎం పేర్కొన్నారు.