Begin typing your search above and press return to search.

త్వ‌ర‌లో పాట రాయ‌నున్న సీఎం కేసీఆర్

By:  Tupaki Desk   |   7 Dec 2017 2:35 PM GMT
త్వ‌ర‌లో పాట రాయ‌నున్న సీఎం కేసీఆర్
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌లోని ప్ర‌తిభాపాట‌వాన్ని మ‌రోమారు ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. త‌న‌లోని క‌ళాప్ర‌ద‌ర్శ‌న‌కు తెలుగు మ‌హాస‌భ‌ల‌ను వేదిక‌గా చేసుకోనున్నారు. మ‌హాస‌భ‌ల వేదిక‌గా కేసీఆర్ త‌న‌లోని ర‌చ‌యిత‌ను మ‌రోమారు వెలికితీయ‌నున్న‌ర‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీలోని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం..కేసీఆర్ ఓ గేయాన్ని ప్ర‌త్యేకంగా రాయ‌నున్నార‌ట‌. ఇందుకు మ‌హాస‌భ‌లు వేదిక కానున్నాయ‌ని తెలుస్తోంది.

గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌కు విశేష భాషా ప్రావిణ్యం ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కు సాహిత్యంపై ఉన్న ప‌ట్టు కార‌ణంగానే అద్భుత‌మైన వ‌క్త‌గా నిలిచారు. ఆక‌ట్టుకునే ప్ర‌సంగం కార‌ణంగానే ఇటు తెలంగాణ‌లోనే కాకుండా మరెన్నో చోట్ల కూడా కేసీఆర్‌కు అభిమానులు ఉన్నారు. ఈ క్ర‌మంలో తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో ఆయ‌న జైబోలో తెలంగాణ సినిమాకు 2014లో ఓ పాఠ రాశారు. ఇప్పుడు అదే రీతిలో తెలుగు మ‌హాస‌భ‌ల‌కు సైతం ఓ పాట‌ రాసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా తెలంగాణ దృక్కోణంలో తెలుగు భాష అనే అంశంపై సీఎం కేసీఆర్ ప్ర‌త్యేకంగా పాట‌ రాయ‌నున్నార‌ని తెలుస్తోంది. కీల‌క‌మైన ఈ అంశంపై ప్ర‌సంగించే స‌మ‌యంలో కేసీఆర్ ఓ పాట‌ను అతిథుల‌కు వినిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ ఇందుకు త‌గిన క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టిన‌ట్లు స‌మాచారం. నిజాం కాలంలో ఉర్దూ నుంచి మొద‌లుకొని రాష్ట్ర విభ‌జ‌న వ‌ర‌కు, ప్ర‌స్తుతం ఆద‌ర‌ణ పొందుతున్న తీరును త‌న ప్ర‌సంగంలో భాగంగా సీఎం కేసీఆర్ వివ‌రించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌సంగంపై ఇప్ప‌టికే ప‌లువురు భాషా పండితులు, నిపుణుల‌తో కేసీఆర్ చ‌ర్చించిన‌ట్లు చెప్తున్నారు.