Begin typing your search above and press return to search.
కేసీఆర్ 'వరి'లొల్లిలో అసలు సాధించిందేంటి?
By: Tupaki Desk | 13 April 2022 9:41 AM GMTకాశీకి వెళ్లి చివరకు బూడిద తెచ్చినట్టు ఉంది టీఆర్ఎస్ పరిస్థితి అని విమర్శలు వినిపిస్తున్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ ఏకంగా దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేశారు. నరేంద్రమోడీపై యుద్ధం ప్రకటించారు. కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనేలా చేస్తామన్నారు.
కానీ చివరకు ఏమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన కేసీఆర్ తమ రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొంటుందని చావు కబురు చల్లాగా చెప్పారు. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో యాసంగి ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొనాలని డిసైడ్ చేసినట్లు మీడియా సమావేశంలో కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం అవసరమైన రూ.3500 కోట్లను వెచ్చిస్తామని తెలిపారు.
కేంద్రప్రభుత్వం ధాన్యం కొనడం లేదని కేసీఆర్ ఇన్ని రోజులుగా చేసిన ఫైట్ ఎందుకు? అని ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు. ధాన్యం మొత్తాన్ని కేసీఆర్ ప్రభుత్వమే కొనాలని డిసైడ్ అయితే ఇన్ని నెలలపాటు కేసీఆర్ ఎందుకింతగా నానా యాగీ చేశారన్నది ఇప్పుడు ప్రశ్న. బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రప్రభుత్వం ఎప్పుడో తేల్చేసింది. మేం పంపమని కేసీఆర్ సంతకం చేశారు. అయినా కొనాల్సిందేనంటూ కేసీఆర్ పట్టుబట్టారు. ఆరు నెలలుగా కేంద్రంపై యుద్ధం ప్రకటించి నానా రచ్చ చేశారు.
మూడు సార్లు ఢిల్లీకి వెళ్లి నానా గోల చేసి వచ్చారు కేసీఆర్. మొన్నటికి మొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులను తీసుకొని ఢిల్లీకి వెళ్లి పెద్ద ధర్నా చేశారు. మోడీని, పీయూష్ గోయల్ పై దుమ్మెత్తిపోశారు. ఇంత హంగామా చేసి చివరకు ఏం సాధించారో తెలియకుండానే ఢిల్లీ నుంచి వచ్చి 24 గంటల డెడ్ లైన్ పెట్టి సవాల్ చేశారు.
ఇంత పెద్ద హెచ్చరికల తర్వాత నిన్న మొత్తం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని ప్రకటించడం చూసి అందరూ ముక్కునవేలేసుకున్నారు. ఈ మాత్రం దానికి కేంద్రంపై ఇంత ఫైట్.. ఇంత నానా యాగీ చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
కేసీఆర్ ప్రకటనలతో ఈ యాసంగిలో వరి వేయకుండా రైతులు బీళ్లుగా వదిలేశారు. ఇఫ్పుడు వరి కొంటానని కేసీఆర్ అంటున్నారు. దీన్ని బట్టి కేసీఆర్ ప్రకటనతో రైతులు నిండా మునిగినట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ మాట పెడచెవిన పెట్టి వరి పండించిన రైతులకు మాత్రం ఈ ప్రకటన ఊరటనిచ్చింది