Begin typing your search above and press return to search.
కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ ఎలా ఉంటుందంటే...
By: Tupaki Desk | 13 Feb 2017 6:04 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కలల ప్రాజెక్టు అయిన కొత్త సెక్రటేరియట్ మరోమారు తెరపైకి వచ్చింది. త్వరలో ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లి బడ్జెట్ సమావేశాల నాటికి పూర్తిస్థాయి అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధులు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గరిష్టంగా ఏడాదిన్నర కాలవ్యవధిలోగా నిర్మాణాలను పూర్తిచేసి ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. తెలంగాణాకు చెందిన నాలుగు బ్లాకులతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన సచివాలయ భవనాలు ఉత్తర, దక్షిణ బ్లాకులు, ఆ రాష్ట్ర సీఎం కార్యాలయమైన ఎల్ బ్లాకును కూడా స్వాధీనం చేసుకుని మరింత విశాలంగా తెలంగాణ సచివాలయాన్ని నిర్మించాలనుకుంటున్నారు. తాజాగా గవర్నర్‌తో జరిగిన భేటీలో ఈ విషయమై సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా సచివాలయంతో పాటు ఇతర శాఖాధిపతుల కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థలు పదేళ్ళ పాటు ఉమ్మడి ఆస్తులుగా గుర్తించారు. అందులో సచివాలయం కూడా ఒకటి. ఆ నిబంధనల మేరకే డి, జె, కె, ఎల్ బ్లాకులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. కానీ పరిపాలనా సౌలభ్యం కోసం చంద్రబాబు రెండున్నర సంవత్సరాలకే తన రాష్ట్ర భూభాగానికి వెళ్ళిపోయారు. దీంతో ప్రస్తుతం ఆ భవనాలు ఖాళీగా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వ యంత్రాంగమంతా అమరావతిలో స్థిరపడడంతో హైదరాబాద్‌లో ఉన్న వారి సచివాలయ భవనాలు వినియోగం లేకుండా ఉన్నాయి. ఎలాగైనా అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబును ఒప్పించి వాటిని స్వాధీనం చేసుకునే దిశగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. గవర్నర్ నరసింహన్ ద్వారా ఆ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వానికి తెలియజేశారు. ఇటీవల రాజ్‌భవన్ వేదికగా జరిగిన ఇరు రాష్ట్రాల కమిటీల సమావేశంలోనూ ఈ అంశంపై చర్చించారు. ఈ చర్చల్లో పాల్గొన్న ఏపీ మంత్రులు విషయాన్ని, ఒత్తిడిని చంద్రబాబుకు వివరించారు. కేసీఆర్ పట్టుదలను చూసి ఇక్కడున్న ఏపీ సచివాలయ భవన సముదాయాన్ని ఇచ్చేస్తేనే మంచిదన్న ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. తాను ఊహించుకున్న విధంగానే ఎలాగైనా నూతన సచివాలయాన్ని నిర్మించి తీరాలని ఆలోచనతో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాచరణను వేగవంతం చేశారు. తాజాగా గవర్నర్‌తో కేసీఆర్ సమావేశం ఇందులో భాగమేనని అంటున్నారు.తరతరాలకు గుర్త్తుండిపోయే విధంగా, దేశంలోనే ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేనివిధంగా కొత్త సచివాలయాన్ని నిర్మించాలన్న తమ ఆశయ సాధనకు సంపూర్ణ సహకారం అందజేయవలసిందిగా కేసీఆర్ నరసింహన్‌ను కోరారు. సాధ్యమైనంత త్వరలో ఏపీ సచివాలయ భవనాలను తమకు అప్పగించేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఎంచుకున్న లక్ష్యంలోగా సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న పట్టుదలతో ముందడుగు వేస్తున్నట్టు ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎపీ ప్రభుత్వం ఆ భవనాలు అప్పగించేందుకు నిరాకరిస్తే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచించారు. ఒకవేళ పదేళ్ళ పాటు ఎపి ప్రభుత్వానికి ఇక్కడ తమకంటూ ఒక స్థానం ఉండాలన్న ఆలోచన ఉంటే హైదరాబాద్‌లో ఉన్న మరే ఇతర భవనాలనైనా కేటాయించేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు.
కేసీఆర్ ప్రణాళికల ప్రకారం అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే నెల మొదటి వారంలో కూల్చివేత పనులను ప్రారంభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్న విధంగా తెలంగాణ సచివాలయంలోని ఎ, బి, సి, డి బ్లాకులను కూల్చివేసి ఆ స్థానంలో భారీ బహుళ అంతస్థుల భవన సమూదాయాన్ని నిర్మించాలనుకున్న సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఏపీకి కేటాయించిన మరో ఐదు బ్లాకులను కూడా స్వాధీనం చేసుకుని మరింత విశాలమైన సచివాలయాన్ని నిర్మించే దిశగా ముందుకు సాగుతున్నారు. పది ఎకరాల విస్తీర్ణంలో నూతన అధికార నివాసాన్ని ఇటీవలే నిర్మించిన సీఎం కేసీఆర్ ఇక సచివాలయాన్ని నిర్మిస్తే సరిపోతుందని భావిస్తున్నారు. ఇప్పుడున్న సచివాలయం రెండు రాష్ట్రాల బ్లాకులు కలుపుకుని 18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమై ఉంది. తెలంగాణ సచివాలయం దాదాపు 10 ఎకరాలు ఉంటుంది. ఎ, బి, సి, డి బ్లాకులను కూల్చివేసి భూగర్భంలో ఆరు అంతస్థుల పార్కింగ్ కాంప్లెక్స్, పైన 8 అంతస్థుల పరిపాలనా భవనాలు నిర్మించేందుకు రోడ్లు, భవనాలశాఖ ఇంజనీరింగ్ నిపుణులు రోడ్‌మ్యాప్‌ను తయారు చేసి ఇటీవలే సీఎంకు అందజేశారు. ‘యు’ ఆకారంలో ఈ సువిశాల బహుళ అంతస్థుల భవనాలు నిర్మించాలని ప్రతిపాదించినప్పటికీ కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. మంత్రులు, ముఖ్య కార్యదర్శుల వాహనాలు మినహా మిగతా ఏ ఒక్క వాహనం కూడా పైన కనిపించకుండా పూర్తిగా అండర్ గ్రౌండ్ పార్కింగ్‌లోనే ఉండేవిధంగా నమూనాను రూపొందించారు. సచివాలయానికి వచ్చే సందర్శకుల వాహనాలకు కూడా అక్కడే ప్రత్యేక ప్రాంతాన్ని కేటాయిస్తారు. ప్రముఖ భవన నిర్మాణాల రూపకర్త హఫీజ్ కాంట్రాక్టర్ తెలంగాణ నూతన సచివాలయ భవన సమూదాయానికి సరికొత్త నమూనాను రూపొందించిన విషయం తెలిసిందే.