Begin typing your search above and press return to search.

కేసీఆర్ డ‌బుల్ గేమ్‌.. మోడీ అవాక్క‌వ‌డ‌మేనా?

By:  Tupaki Desk   |   11 April 2022 2:30 AM GMT
కేసీఆర్ డ‌బుల్ గేమ్‌.. మోడీ అవాక్క‌వ‌డ‌మేనా?
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గ‌త కొద్దికాలంగా రాజ‌కీయాల్లో హీట్ పెంచిన సంగ‌తి తెలిసిందే. యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొనాలనే డిమాండ్‌తో 11న ఢిల్లీలో టీఆర్ఎస్‌ చేపట్టే ధర్నాతో హ‌స్తినలో హీట్ పుట్టించేందుకు గులాబీ ద‌ళ‌ప‌తి ప్లాన్ చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేక సర్కార్‌గా జనం ముందు నిలబెట్టడంలో ఇప్ప‌టికే విజ‌యం సాధించిన టీఆర్ఎస్ అధినేత ఇప్పుడు ఢిల్లీ వేదిక‌గా త‌మ గేమ్ ప్లాన్ అమ‌లు చేయ‌నున్నారు. అయితే, ఇదే స‌మ‌యంలో మ‌రింత‌గా బీజేపీని టార్గెట్ చేసేందుకు ఆయ‌న వ్యూహాలు ప‌న్నుతున్నారు.

ఇటు పార్టీ అటు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం రూపంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళ‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌వేళ‌, కేంద్రం దిగిరాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. కేంద్రంపై పోరును కొనసాగిస్తూనే.. ఇటు రాష్ట్ర రైతులు యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.

తద్వారా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకమంటూ ఎత్తిచూపడం, బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాలన్నింటినీ తిప్పికొట్టడంతోపాటు రైతులకు అండగా నిలిచేది రాష్ట్ర ప్రభుత్వమేనన్న సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఇటు రైతు సంక్షేమం అటు బీజేపీని ఇరుకున పెట్ట‌డం సుల‌భం అవుతుంద‌ని గులాబీ ద‌ళ‌ప‌తి భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

బీజేపీని టార్గెట్ చేసేందుకు మాత్ర‌మే కాకుండా మ‌రో వ్యూహం ప్ర‌కారం కూడా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంద‌ని అంటున్నారు. న్ని జిల్లాల్లో వరికోతలు ఇప్పటికే మొదలై ప్రైవేటు విక్రయాలు సాగుతున్నాయి. ఈనెల మూడో వారం నుంచి వరి కోతలు ఊపందుకోనున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ నెల 11న ధర్నా అనంతరం ధాన్యం కొనుగోళ్లపై కీలక ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టమైన నిర్ణయానికి వచ్చినట్టు స‌మాచారం. అయితే, గత యాసంగి కంటే వరిసాగు తగ్గడం, మిల్లర్లు, దళారుల కొనుగోళ్ల నేపథ్యంలో.. ఈసారి ప్రభుత్వ కేంద్రాలను తక్కువగానే ఏర్పాటు చేసే అవకాశం ఉంది.