Begin typing your search above and press return to search.
సుడి అంటే కేసీఆర్ దే బాస్.. ఏపీ నుంచి పోటెత్తుతున్న ఐటీ ఉద్యోగులు
By: Tupaki Desk | 17 April 2022 3:44 AM GMTసుడి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని చెప్పాలి. పక్కడి ఫెయిల్యూర్ కూడా తమ సక్సెస్ గా మలుచుకునే లక్ అందరికి ఉండదు. కానీ.. ఆ విషయంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అదృష్టం అంతా ఇంతా కాదనే చెప్పాలి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు సర్కారు దారుణ పరాజయం పాలు కావటం.. జగన్ ముఖ్యమంత్రి కావటం తెలిసిందే. అప్పటి నుంచి కేసీఆర్ సుడి మరింత తిరిగిపోయిందనే చెప్పాలి.
పక్కా ఎజెండాతో ముందుకు వెళుతున్న జగన్ తీరు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కలిసి వచ్చేలా చేసింది. 2014 రాష్ట్ర విభజన వేళ.. ఏపీలో చంద్రబాబు సర్కారు ఏర్పాటైతే.. తెలంగాణలో కేసీఆర్ సర్కారు కొలువు తీరింది. ఏపీ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయటం.. అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు తీరు ఎలా ఉంటుందన్న సందేహాలు ఉండేవి. అదే సమయంలో చంద్రబాబు పాలనా సామర్థ్యం మీద ఉన్న నమ్మకం.. అమరావతిని రాజధానిగా ప్రకటించటంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున అక్కడకు తరలి వెళ్లాయి. దీంతో.. హైదరాబాద్ రియల్ రంగంలో అంత జోష్ ఉండేది కాదు.
విభజన నాటికే ఒక స్థాయికి చేరిన హైదరాబాద్ ఐటీ రంగంతో పోలిస్తే.. ఏపీలో ఐటీలో సున్నా ఒక శాతం కూడా లేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఏపీలో ఐటీ అవకాశాలు పెంచేలా చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసేది. దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య డెవలప్ మెంట్ విషయంలో పోటాపోటీ ఉండేది. ఏపీకి ఒక పరిశ్రమ వస్తే.. తెలంగాణకు మరో పరిశ్రమను తేచ్చేలా పోటీ వాతావరణం ఉండేది.
అదంతా 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల ముందు వరకే. ఎప్పుడైతే ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిందో.. రాజకీయ సమీకరణాలు మాత్రమే కాదు.. రాజకీయాలు సైతం మారిపోయాయి. దీంతో.. అప్పటివరకు లేని రీతిలో ఏపీలో ప్రతికూల పరిస్థితులు మొదలయ్యాయి. ఇది తెలంగాణకు అనుకూలంగా మారింది. రాజధానిగా అమరావతి స్థానే... మూడు రాజధానుల మాట రావటం.. హైదరాబాద్ కు తిరుగులేని రీతిలో మారిపోయింది. ఎవరి చూపైనా హైదరాబాద్ మీద పడేలా చేసింది. దీంతో అమరావతిలో రియల్ ఎస్టేట్ జోరు తగ్గిపోయి.. అందుకు ప్రతిగా హైదరాబాద్ లో పెరిగింది.
అనుకోని రీతిలో పడిన కరోనా పిడుగుతో రెండుతెలుగు రాష్ట్రాలు ఉక్కరిబిక్కిరి అయ్యాయి. కరోనా.. లాక్ డౌన్ లాంటి పరిస్థితులతో హైదరాబాద్ లో ఉన్న చాలామంది ఏపీ ప్రాంతానికి చెందిన వారు ఐటీ కంపెనీలు ఇచ్చిన వర్కు ఫ్రం హోం అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏపీతో పాటు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. ఇలాంటివేళ.. హైదరాబాద్ లో ఎలాంటి పరిస్థితి ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలక్రమంలో రెండేళ్లు గడిచిపోవటం.. కరోనా ముప్పు నుంచి బయటకు వచ్చేసిన తర్వాత.. కంపెనీలకు ఉద్యోగుల్ని తీసుకురావటం కష్టంగా మారింది.
కరోనా ముప్పు పోయిన నేపథ్యంలో.. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే ఐటీ కంపెనీల ఎప్పటిలా పని చేయాలి. అప్పుడే ఉద్యోగులు ఇంట్లో నుంచి బయటకు వచ్చి.. ఆఫీసులకు వెళ్లటం మొదలు పెడితే ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయి. అప్పుడు చిన్న టిఫిన్ కొట్టు వాడి దగ్గర నుంచి పాన్ డబ్బా వాలా వరకు ఉపాధి లభిస్తుంది. అయితే.. ఏపీ నుంచి హైదరాబాద్ కు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపక.. వచ్చే ఏడాది వద్దామనుకునే పరిస్థితి.
ఇలాంటి సమయంలోనూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సుడి మామూలుగా లేదు. జగన్ సర్కారు అనుసరించిన విధానాలతో ఏపీలో పెద్ద ఎత్తున కరెంటు కోతలు నెలకొన్న నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటి నుంచి పని చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో.. వారిప్పుడు ఏపీని వదిలేసి.. హైదరాబాద్ బాట పడుతున్నారు. దీని వల్ల జరిగేదేమంటే.. హైదరాబాద్ లో ఆర్థిక కార్యకలాపాలు జోరందుకుంటే.. అందుకు భిన్నంగా ఏపీలో ఖర్చు పెట్టే వారు అంతకంతకూ తగ్గే పరిస్థితి. ఇప్పుడు చెప్పండి కేసీఆర్ సుడి మామూలుగా లేదన్న మాటలో వాస్తవం ఎంతన్నది?