Begin typing your search above and press return to search.
జై కేసీయార్ అంటున్న తమ్ముళ్ళు...?
By: Tupaki Desk | 30 April 2022 1:30 AM GMTరాజకీయాల్లో జై నినాదాలు వినిపించినతసేపు పట్టదు నై నినాదాలు వినిపించడానికి. ఎంత చెప్పుకున్నా అది ఒక రాజకీయ క్రీడగానే చూడాలి. విషయానికి వస్తే కేసీయార్ కూడా ఒకనాటి టీడీపీ తమ్ముడే. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడే. బాబు తొలిసారి సీఎం అయిన వేళ ఆయన కోటరీలో కీలక నేతగా కె చంద్రశేఖరరావు ఉన్నారు. మంత్రి పదవిని కూడా నిర్వహించారు. ఆ తరువాత రెండవమారు మంత్రి పదవి లభించకపోతే ఆయన తన దారి తాను చూసుకున్నారు.
సరే టీయారెస్ ఆవిర్భావం వెనక కధలు ఎన్ని ఉన్నా 2009 నాటికి ఇద్దరు చంద్రులూ నాటి ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్సార్ కి వ్యతిరేకంగా కలిశారు. మహా కూటమిని ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో పరాజయం దక్కింది. ఆ తరువాత విడిపోయారు. ఇక 2014 నాటికి ఉమ్మడి ఏపీ విభజన జరిగింది. తెలంగాణాలో కేసీయార్ సీఎం అయితే ఏపీకి ఫస్ట్ సీఎం గా చంద్రబాబు వచ్చారు.
కొన్నాళ్ళ పాటు ఇద్దరి మధ్య సయోధ్య నడిచింది. బాబు కలల రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీయార్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే తరువాత జరిగిన కొన్ని పరిణామాల నేపధ్యంలో ఈ ఇద్దరు చంద్రులూ విడిపోయారు. ముఖ్యంగా ఓటుకు నోటు కేసు చిచ్చు పెట్టింది. హరిహరాదులు అడ్డు వచ్చినా ఆ బ్రహ్మ అడ్డుపడినా కూడా చంద్రబాబుని ఈ కేసు నుంచి తప్పించలేరు అని ఒక అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ కేసీయార్ గర్జించారు.
ఆ తరువాత ఏమైందో ఏమో కానీ కేసు ప్రసక్తే లేకుండా పోయింది. ఇక 2018 లో చంద్రబాబు కాంగ్రెస్ తో కలసి తెలంగాణాలో పోటీ చేస్తే దాన్నే ట్రంప్ కార్డుగా వాడుకుని కేసీయార్ రెండవసారి గెలిచారు. నాడు బాబుని ఆయన ఘాటుగానే విమర్శించారు. ఇక గత మూడేళ్ళుగా చూస్తే ఈ ఇద్దరి మధ్యన మాటల యుద్ధాలు అయితే లేవు. దాంతో ఏదో తెలియని సయోధ్య ఉందేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
శతృవుకు శతృవు మిత్రుడు అన్నట్లుగా ఏపీలో జగన్ తో బాబుకు రాజకీయ వైరం ఉంది. కేసీయార్ కి కూడా తన మనిషి అనుకున్న జగన్ తన మాట వినడంలేదు అన్న గుర్రు ఉంది. మోడీకి యాంటీగా తాను ఫ్రంట్ కట్టాలనుకుంటే బ్యాక్ న జగన్ ఉండడమే లేదని కేసీయార్ తీవ్రంగా మండిపడుతున్నారు అంటారు. ఇపుడు చూస్తే చంద్రబాబు మాజీ సీఎం. పైగా ఆయనతో కొత్తగా వచ్చే ఇబ్బంది అయితే లేదు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బాబు గెలిచినా కేసీయార్ కి పోయేది ఏమీ లేదు.
బాబు తెలంగాణాలో ఏం జరిగినా అక్కడ నివాసం ఉంటున్న ఒక పౌరుడిగానే చూస్తున్నారు తప్ప టీడీపీ జాతీయ ప్రెసిడెంట్ గా ఒక్క మాట కూడా అనడంలేదు. దాంతో కేసీయార్ వైపు నుంచి చూస్తే సానుకూలత ఉండే చాన్స్ ఉంది. ఈ క్రమంలో జగన్ మీద చీటికి మాటికీ తెలంగాణా మంత్రులు హాట్ కామెంట్స్ తో విమర్శలు చేస్తున్నారు.
ఇక కేసీయార్ వారసుడు కేటీయార్ అయితే తాజాగా దారుణమైన కామెంట్స్ తాజాగా చేశారు. ఏపీలో ఏముంది అభివృద్ధి అంటూ ఒక్క మాటతోనే మంటలు పుట్టించారు. ఒక విధంగా అది విపక్ష టీడీపీకి వజ్రాయుధం లాంటిదే. దాన్ని పట్టుకుని ఏపీలో టీడీపీ తమ్ముళ్ళు ఒక ఆట ఆడేసుకుంటున్నారు వైసీపీ మీద. నారా లోకేష్ అయితే అట్టుంటది ఒక్క చాన్స్ తో మనతోటి అని కేటీయార్ కి ఫుల్ సపోర్ట్ అన్నట్లు ట్వీట్ చేశారు.
కేటీయార్ ఏం తప్పు మాట్లాడారు, ఉన్న మాటనే చెప్పారు కదా అంటున్నారు మరో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఇదే తీరున మిగిలిన తమ్ముళ్ళు గట్టిగా తగులుకుంటున్నారు. వైసీపీ ఏలుబడిలో ఏపీ సర్వనాశనం అయిందని, తోటి తెలుగు రాష్ట్ర మంత్రి ఇదే చెబుతున్నారని వారు అంటున్నారు. మొత్తంగా చూస్తే జై కేసీయార్ అన్నట్లుగానే తమ్ముళ్ళు రియాక్ట్ అవుతున్నారు.
ఇదే తరహాలో మరిన్ని వజ్రాయుధాలు తమకు సమకూరిస్తే చాలు జగన్ మీద తాము రెచ్చిపోతామని తమ్ముళ్ళు అంటున్నారు. సో ఇద్దరు చంద్రులూ ఒకే లైన్ లోకి వస్తే కనుక తెలుగు రాజకీయాలే టోటల్ చేంజ్ అవుతాయి. ఇన్ని చెప్పుకున్నా ఒక్కటే డౌట్. ఇద్దరు చంద్రులూ అపర చాణక్యులే. ఇద్దరిదీ దూర దృష్టి కలిగిన వ్యూహలే. సో ఒకే సరళ రేఖ మీద పూర్ణ చంద్రోదయం అవుతుందా. ఏమో ఇది రాజకీయం. చూడాల్సిందే.