Begin typing your search above and press return to search.

చూస్తుంటే...కేసీఆర్‌కు మోడీ నుంచి పిలుపు వ‌చ్చేలా ఉందే

By:  Tupaki Desk   |   8 May 2022 10:30 AM GMT
చూస్తుంటే...కేసీఆర్‌కు మోడీ నుంచి పిలుపు వ‌చ్చేలా ఉందే
X
గ‌త కొంత‌కాలంగా ఉప్పు నిప్పు అన్న‌ట్లుగా సాగుతున్న బీజేపీ - టీఆర్ఎస్‌ల దోస్తీలో కొత్త ఎపిసోడ్ తెర‌మీద‌కు రానుందా? బీజేపీ ర‌థ‌సార‌థి, ప‌్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ త్వ‌ర‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు స్నేహ‌హ‌స్తం చాట‌నున్నారా? దీనికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఓకే అంటారా? ఇవ‌న్నీ ఇప్పుడు రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌. టీఆర్ఎస్ - బీజేపీల మ‌ధ్య దోస్తీ అంశం తెర‌మీద‌కు వ‌చ్చేందుకు అస‌లు కార‌ణం... రాష్ట్రప‌తి ఎన్నిక‌లు. ఈ ఎన్నిక‌ల కోసం అధికార బీజేపీ వేస్తున్న ఎత్తులు.

రాబోయే ఆగ‌స్టులో రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిని గెలుచుకునేందుకు బీజేపీకి మ‌రికొంత మంది స‌భ్యుల మ‌ద్ద‌తు కావాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ త‌న పావులు క‌దప‌డం ప్రారంభించింది. ప్రాంతీయ పార్టీల నేత‌ల‌తో మంత‌నాలు మొద‌లుపెట్టేసింది. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని, కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ బిహార్ సీఎం నితీశ్‌తో భేటీ అయ్యారు. దాదాపు 2 గంట‌ల పాటు వీరిద్ద‌రూ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల గురించి చ‌ర్చించుకున్నారు. ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక కూడా ఈ చ‌ర్చ‌ల్లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. ఎన్డీయే ప‌క్షాల త‌ర‌పున రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎవ‌ర్ని రంగంలోకి దింపాలి? ఏయే స‌మీక‌ర‌ణాల‌ను తెర‌పైకి తేవాలి? అనుస‌రించాల్సిన వ్యూహం.. త‌దిత‌ర అంశాల‌ను వీరిద్ద‌రూ చ‌ర్చించడంతో బీజేపీ గేమ్ ప్లాన్ మొద‌లైంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

త్వ‌ర‌లోనే ప్రాంతీయ పార్టీలతో , ముఖ్యంగా వివిధ సంద‌ర్భాల్లో త‌మ‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన పార్టీల నేత‌ల‌తో బీజేపీ ముఖ్యులు మంత‌నాలు జ‌రిపే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. గ‌తంలో టీఆర్ఎస్ పార్టీ వివిధ కీల‌క సంద‌ర్భాల్లో బీజేపీ బిల్లుల‌కు, నిర్ణ‌యాల‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ ద‌ఫా కూడా `అభ్య‌ర్థిని బ‌ట్టి` టీఆర్ఎస్ నిర్ణ‌యం ఉండే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. అయితే, బీజేపీతో దూరం పాటిస్తున్న టీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ రాబోయే ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి అండ‌గా ఉండే చాన్స్ లేదంటున్నారు.