Begin typing your search above and press return to search.

సోష‌ల్ వార్ : ఎవ‌రి సొమ్ము ఎవ‌రికి పంచుతున్న‌రు కేసీఆర్ !

By:  Tupaki Desk   |   22 May 2022 2:30 PM GMT
సోష‌ల్ వార్ :  ఎవ‌రి సొమ్ము ఎవ‌రికి పంచుతున్న‌రు కేసీఆర్ !
X
ఇంటికి  మూడు ల‌క్ష‌లు.. 600 కుటుంబాలు..  పంజాబ్ మ‌రియు హ‌ర్యానా రైతుల‌కు సాగు చ‌ట్టాల వ్య‌తిరేక ఉద్యమాల్లో అసువులు బాసిన రైతుల‌కు అండ‌గా డ‌బ్బు అంద‌జేతకు కేసీఆర్ సిద్ధం అయ్యారు. ఇది ఓ ప్ర‌భుత్వం మ‌రో ప్ర‌భుత్వానికి చేసిన లేదా చేయాల‌నుకున్న సాయానికి ప్ర‌తిరూపం. ఇంత మొత్తం అంద‌జేస్తున్నరు స‌రే తెలంగాణ రైతుల‌కు ఏమ‌యినా మంచి చేసిన్రా మీరు అని ప్ర‌శ్నిస్తున్నారు విప‌క్ష పార్టీ నేత‌లు.

ఇప్ప‌టిదాకా రుణ మాఫీ పై కానీ లేదా రైతు బంధు సాయం లో కానీ వ‌డ్లు కొనుగోలుపై కానీ కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాలు వాటి అమ‌లు ఏ విధంగా ఉందో అన్న‌ది ఒక్క‌సారి ఆరా తీస్తే అప్పుడు పాల‌న ఎంత నిష్ప‌క్ష‌పాతంగా సాగుతుందో అన్న‌ది ఇట్టే అర్థం అవుతుంద‌ని విప‌క్షం దుమ్మెత్తిపోస్తోంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ దేశ్ కీ నేతా అనే ట్యాగ్ ను పొందేందుకు కేసీఆర్ ఇలా చేయ‌డం అన్న‌ది కొంద‌రికి ఆమోదంగా ఉన్నా మ‌రికొంద‌రికి మాత్రం చాలా అంటే చాలా కోపం తెప్పిస్తోంది.

నిన్న‌మొన్న‌టి  దాకా యాసంగి ధాన్యం కొనుగోళ్ల విష‌య‌మై నానా కొట్లాటనూ ప‌డిన కేసీఆర్, ఇప్పుడు మాత్రం పంజాబ్ మ‌రియు  హర్యానా రైతు కుటుంబాల‌కు త‌న సొంత డ‌బ్బు అన్న విధంగా ప్ర‌భుత్వ నిధిని పంచ‌డం ఎంత‌వ‌ర‌కూ స‌బ‌బు అన్న‌ది ఓ ప్ర‌శ్న వైర‌ల్ అవుతోంది. సాగు చ‌ట్టాల‌కు ఆ రోజు మ‌ద్ద‌తు ప‌లికిన దాఖ‌లాలు ఉన్నాయని కానీ వాటిని లోపాయికారిగా ఒప్పుకున్న ప్రాంతీయ పార్టీల‌లో పొరుగు వైసీపీతో పాటు కేసీఆర్ కూడా ఉన్నార‌ని విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.

రైతుకు సాయం చేసే విష‌య‌మై ఎవ్వ‌రూ అభ్యంత‌రం చెప్ప‌రు కానీ ప్ర‌భుత్వం ఇక్క‌డ లోపాల‌ను స‌రిదిద్ది, ఇక్క‌డి రైతుల‌కు న్యాయం చేసి అప్పుడు ఇరుగు పొరుగు ప్రాంతాల‌పై దృష్టి సారిస్తే మేలు అని విప‌క్ష నేత‌లు హిత‌వు చెబుతున్నారు. సాగు చ‌ట్టాల ర‌ద్దు త‌రువాత స్థితిగ‌తులు ఏమీ మార‌లేద‌ని, ఏటా ఉన్న విధంగానే తుఫానుల కార‌ణంగా పంట పోయి రైతు రోడ్డున ప‌డితే తెలంగాణ ప్ర‌భుత్వం ఆదుకున్న దాఖలాలు అతి కొద్దిగానే ఉన్నాయ‌ని విపక్ష పార్టీలు మండిప‌డుతున్నాయి. పొలిటిక‌ల్ మైలేజే ప్ర‌ధానం అని అనుకుని చేస్తున్న సాయం కార‌ణంగా కేసీఆర్ కు పేరు మ‌రియు ప్ర‌తిష్ట వ‌స్తాయేమో కానీ ఇక్క‌డి రైతుల ఆక‌లి కేక‌లు తీరవు అని అంటున్నారు వీరంతా !