Begin typing your search above and press return to search.
ఇది కదా దమ్మంటే.. స్టాలిన్ ను చూసి నేర్చుకోండి కేసీఆర్
By: Tupaki Desk | 27 May 2022 4:30 AM GMTతెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. గడిచిన ఎనిమిదేళ్లలో ఏం చేశారో చూస్తున్నదే. ఇప్పుడు ఆయన ఫోకస్ మొత్తం జాతీయ రాజకీయాల మీద పడింది. ఇప్పుడు యావత్ దేశాన్ని అర్జెంట్ గా మార్చేయాలన్న ఆలోచనకు ఆయన వచ్చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఫార్మర్ హౌస్ లో రోజుల తరబడి మధనం చేసిన ఆయన.. ఒక రోడ్ మ్యాప్ వేసుకొని మరీ వివిధ రాష్ట్రాలకు వెళుతున్నారు. ఇదంతా చూసినోళ్లు.. వావ్ అనేస్తూ భజన చేస్తున్నారు. ఇలాంటివేళ.. రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి మోడీని కలవకుండా.. చాలా అర్జెంట్ పని ఉందన్నట్లుగా బెంగళూరుకు వెళ్లి మాజీ ప్రధానమంత్రి దేవెగౌడతో భేటీ అయి వచ్చారు.
రాష్ట్రానికి వస్తున్న ప్రధానమంత్రిని కలవటం ఇష్టం లేని కేసీఆర్ వేరే రాష్ట్రానికి వెళ్లారని ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడటం కనిపిస్తుంది. దేశ ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తుంటే.. ఆయన్ను కలవకుండా ముఖం చాటేయటంతో వచ్చే లాభమేంది? విధానాల పరంగా తేడాలు ఉండొచ్చు. అంతమాత్రానికే కలవటం బంద్ చేయటం ఏమిటి? అదేం పద్దతి. నిజంగానే కేంద్రం తీరు తేడాగా ఉన్నప్పుడు.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కడిగిపారేయటం కానీ.. లేదంటే చెప్పాల్సిన విషయాన్ని చెప్పే రీతిలో సూటిగా చెబితే ఆ లెక్క వేరుగా ఉంటుంది.
అందుకు భిన్నంగా వేరే రాష్ట్రానికి వెళ్లిపోవటం సమస్యకు పరిష్కారం కాదు కదా? కేంద్రం చేసిన తప్పుల చిట్టాను ప్రెస్ మీట పెట్టి అదే పనిగా చెప్పే బదులు.. ప్రధాని ముందే లెక్క తేల్చే ధైర్యం చేస్తే ఎలా ఉంటుంది? తాజాగా అలాంటి పనే చేశారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్. హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లిన ప్రధానమంత్రికి తనదైన రీతిలో మర్చిపోలేని అనుభవాన్ని మిగిల్చారు స్టాలిన్.
ప్రధాని మోడీ ఎదుటే.. తన విధానాల్ని.. డిమాండ్లను ప్రస్తావించటం ద్వారా.. దమ్ము అంటే ఇది కదా? అన్న భావన కలిగేలా చేశారు. ద్రవిడ మోడల్ పాలనను యావత్ దేశానికి చూపిస్తామన్న ఆయన మాటలు మోడీ విధానాల్ని సూటిగా తప్పు పట్టేలా ఉండటమే కాదు.. మీ విధానాల కంటే మా విధానాలు చాలా మెరుగు. ఇప్పుడు దేశానికి కావాల్సింది ఇదే అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పినట్లైంది.
ఇలా ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీద చెప్పేయాలే కానీ.. సరిగ్గా ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చే వేళలో.. ఆయనతో భేటీ కాకుండా.. ఆయనకు సమస్యలు ప్రస్తావించకుండా.. వేరే రాష్ట్రానికి వెళ్లటమో.. లేదంటే ఫాం హౌస్ (ఫార్మర్ హౌస్)కో.. ప్రగతిభవన్ కో పరిమితం కావటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నది గుర్తించాల్సిన అవసరం ఉంది. తనకు మించిన మేధావి లేదన్నట్లుగా మాట్లాడే సీఎం కేసీఆర్.. తన వాదనను ప్రధాని ఎదుట ధైర్యంగా..దమ్ముగా వినిపించరెందుకు? దేశం మొత్తం తిరిగి కొత్త జట్టు కడతానని చెప్పే ఆయన.. అంతకు ముందు రాష్ట్రానికి జరుగుతున్న నష్టం గురించి ఎవరైతే బాధ్యుడిగా భావిస్తున్నారో వారితోనే నేరుగా మాట్లాడరెందుకు?