Begin typing your search above and press return to search.
ఆవిర్భావం : మోడీ వద్దన్నా కేసీఆర్ తగ్గడం లేదే ? ఆహా !
By: Tupaki Desk | 2 Jun 2022 5:30 PM GMTవిద్యుత్ రంగానికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త సమస్యలు మరియు సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కేంద్రం చెబుతున్న వాటికి రాష్ట్రాలు పెద్దగా సానుకూలంగా లేదు. కొన్ని విషయాల్లో ప్రజలకు తెలియజేయనివ్వకుండానే విధాన పర నిర్ణయాలు తీసుకుని విస్మయపరుస్తోంది.
ఈ నిర్ణయాల కారణంగా విద్యుత్ కొనుగోలు, సరఫరా మిగతా వ్యవస్థ మరియు విధానం పలు సమస్యలను ఎదుర్కొంటోంది. ఇక రాష్ట్రాలకు ఎప్పటి నుంచో కేంద్రం ఉచిత విద్యుత్ వద్దనే అంటోందన్న వాదన ఒకటి వినిపిస్తోంది. ఉచిత విద్యుత్ అనే కాదు అనేక ఉచిత హామీలను, సంబంధిత పథకాలను వాటి అమలను కూడా వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే ఆర్థిక భారం దృష్టిలో ఉంచుకోకుండా కేవలం ఆ సమయానికి ఒడ్డెక్కేందుకు ఇచ్చిన హామీల కారణంగా తరువాత చాలా అంటే చాలా ఇబ్బందులు ప్రాంతీయ పార్టీల నేతృత్వంలో ఏర్పడుతున్న ప్రభుత్వాలు చవి చూస్తున్నాయి.
అందుకే కేంద్రం ఎప్పటి నుంచో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వద్దని లేదంటే వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు అమర్చి తద్వారా వచ్చే బిల్లును రాష్ట్రాలే భరించాలని కూడా అంటోంది. వాస్తవానికి విద్యుత్ ను తన అధీనంలోకి తీసుకునేందుకు చూస్తోంది. పరితపిస్తోంది అని రాయాలి. కొనుగోలు, సరఫరా వంటి ఒప్పందాలు కూడా తామే చేయాలని అనుకుంటోంది కేంద్రం. అందుకే కేసీఆర్ వీటిని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. హరీశ్ రావు సైతం వీటిపై రైతులలో అవగాహన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజాగా ఇవాళ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కూడా విద్యుత్ రంగానికి సంబంధించే కేసీఆర్ ప్రత్యేకించి ప్రస్తావన చేశారు.తెలంగాణ ఏర్పాటు అయిన నాటికి మన ప్రాంత ఉత్పత్తి సామర్థ్యం ఏడు వేల మెగా వాట్లకు పైగా ఉండేదని, కానీ ఇప్పుడు అది 17 వేలకు పైగా మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుందని, ఇదొక గొప్ప పరిణామం అని చెబుతున్నారు కేసీఆర్. మరోవైపు బీజేపీతో సహా ఇతర విపక్షాలు సైతం విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, కొందరికీ జీతాలే లేవని అంటున్నారు.ఈ తరుణంలో ఉచిత విద్యుత్ హామీని మరోసారి తె రపైకి తెచ్చి ఓట్లు రాబట్టుకుని తీరాలని కేసీఆర్ యోచిస్తున్నారని చెబుతున్నారు.