Begin typing your search above and press return to search.
హిస్టరీ గుర్తు చేసి మరీ యశ్వంత్ గెలుపు ఎలా సాధ్యమో చెప్పిన కేసీఆర్
By: Tupaki Desk | 3 July 2022 3:01 AM GMTతన నోటి నుంచి వచ్చే మాటలకు తగ్గట్లుగా వాదనల్ని వినిపించే అలవాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎక్కువేనన్న విషయం తెలిసిందే. ఏదైనా అంశంపై స్టాండ్ తీసుకునే దశలోనే.. దానికి సంబంధించిన అన్ని అంశాల్ని అధ్యయనం చేసుకోవటం.. తన మాటల్ని విన్నంతనే కన్వీన్స్ అయ్యేలా మాట్లాడటం ఆయన చతురతకు నిదర్శనంగా చెప్పాలి. గెలుపు ఖాయమన్నట్లుగా ఉన్న ఎన్డీయే.. ఎన్డీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ఇస్తున్న రాష్ట్రపతి అభ్యర్థిపై పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తున్న వారిలో టీఆర్ఎస్ కూడా ఒకటి. తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ కు వచ్చిన యశ్వంత్ సిన్హాకు.. తనదైన మర్యాదల్ని చూపించిన కేసీఆర్.. పనిలో పనిగా ఆయన్ను పక్కన పెట్టుకొని.. రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపు సాధ్యమేనంటూ వాదనలు వినిపించారు.
అదెలా అన్న సందేహానికి సమాధానం ఇచ్చిన కేసీఆర్.. చరిత్రను గుర్తు చేశారు. ''ఓటు వేసేటప్పుడు రాష్ట్రపతి అభ్యర్థులను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఎంపీలు.. ఎమ్మెల్యేలు మన:సాక్షిని అనుసరించి.. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలి. గతంలో వీవీ గిరి అలానే గెలిచారు. అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి పదవిలో ఉండే వారు ఉన్నతమైన వ్యక్తులై ఉండాలి. యశ్వంత్ ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవారు. రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. వివిధ హోదాల్లో దేశానికి సేవలు అందించారు. అలాంటి విశేష అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రపతి పదవికి అన్ని విధాలుగా అర్హులు'' అంటూ చెప్పుకొచ్చారు.
నిజమే.. సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యం. కానీ.. ఆయన చెప్పినట్లుగా ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేసే మైండ్ సెట్.. ఇప్పటి రాజకీయ నేతల్లో అస్సలు కనిపించదు. పార్టీ నిర్ణయించిన వారికి ఓటు వేయటం ద్వారా తమ విధేయతను ప్రదర్శించటమే తప్పించి.. మరో ఆలోచన చేయని ఇప్పటి తరం నేతలకు కేసీఆర్ మాటలు ఎక్కే అవకాశమే లేదు. ఎక్కడిదాకానో ఎందుకు.. ఇన్ని మాటలు చెప్పిన కేసీఆర్.. తమ పార్టీకి చెందిన వారు సైతం ఏదైనా ఎన్నికల్లో మన:సాక్షి చెప్పినట్లుగా ఓటు వేసేంత స్వేచ్ఛ.. స్వతంత్రం గులాబీ ప్రజాప్రతినిధులకు ఉందంటారా?