Begin typing your search above and press return to search.

కేసీయార్ కు ఏమైందో అర్ధం కావటం లేదు

By:  Tupaki Desk   |   11 July 2022 11:30 PM GMT
కేసీయార్ కు ఏమైందో అర్ధం కావటం లేదు
X
కేసీయార్ కు ఏమైందో అర్ధం కావటం లేదు. మామూలుగా అయితే బాగానే మాట్లాడుతారు. కానీ ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడిన మాటలు విన్న తర్వాత సీఎంకు ఏమైందని జనాలే అనుకుంటున్నారు. ఇంతకీ జనాలకు ఇంత అనుమానం ఎందుకు వచ్చింది ? ఎందుకంటే నాలుగు పాయింట్లు విన్నతర్వాతే అనుమానాలు పెరిగిపోయాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం తనకు లేదన్నారు.

అసలు ఆ ఉద్దేశ్య మున్నా కేంద్రప్రభుత్వాన్ని పడగొట్టేంత సీన్ కేసీయార్ కుందా ? అన్నదే ప్రశ్న. రెండో పాయింట్ ఏమిటంటే కేంద్రంలో బీజేపీ ముందస్తు ఎన్నికలకు వస్తే తాను కూడా అసెంబ్లీని రద్దుచేస్తానని ప్రకటించారు. పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు వస్తాయని ఎవరైనా చెప్పారా ? ముందస్తు ఎన్నికలకు వెళ్ళదలచుకుంటే తాను వెళ్ళాలి కానీ కేసీయార్ కోసం మోడీ ముందస్తు ఎన్నికలకు వెళతారా ?

ఇక మూడో పాయింట్ ఏమిటంటే రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ కు ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ధైర్యముందా ? అని నిలదీశారు. ప్రతిపక్షాలు ముందస్తు ఎన్నికలకు వెళతాయా ? ప్రతిపక్షాలు అడిగితే కేంద్ర ఎన్నికల కమీషన్ ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తుందా ? అసలు అసెంబ్లీని రద్దుచేసుకునే అవకాశం అధికార పార్టీకి ఉంటుందా లేకపోతే ప్రతిపక్షాలకు ఉంటుందా ? అధికారపార్టీ అనుకుంటేనే కదా ముందస్తో లేకపోతే మధ్యంతర ఎన్నికలో వచ్చేది.

పై మూడుపాయింట్లను విన్నతర్వాత కేసీయార్ కు ఏమైందనే అనుమానాలు పెరగకుండా ఎలాగుంటుంది ? ఎంతో అనుభవజ్ఞుడైన కేసీయార్ కూడా ముందస్తు ఎన్నికల గురించి ఇలా మాట్లాడటమే విచిత్రంగా ఉంది. ఒకవైపేమో ఎన్నికలు ఎప్పుడువచ్చినా రెడీ అంటూ కాంగ్రెస్, బీజేపీలు తొడకొడుతున్నాయి. అధికార పార్టీ ముందస్తు లేదా మధ్యంతర ఎన్నికలకు వెళ్ళిన తర్వాత ప్రతిపక్షాలు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకుండా ఏమిచేస్తాయి. హేమిటో కేసీయార్ కూడా ఇలా మాట్లాడేస్తే ఎలాగ ?