Begin typing your search above and press return to search.
మీరు ఆగమైతే.. అందరిని ఆగమాగం చేస్తారేంది కేసీఆర్?
By: Tupaki Desk | 11 July 2022 9:35 AM GMTఆదివారం. దానికి తోడు చల్లని సాయంత్రం. ఒక మోస్తరుగా కురుస్తున్న వాన. టైర్ టూ.. టైర్ త్రీ పట్టణాల్లో అయితే.. ఇలాంటి వాతావరణం వేళ.. ఇంట్లో కూర్చొని పకోడి తింటూనే.. మిర్చి బజ్జీ లాగిస్తూనో.. ఇంట్లో వారందరితో కలిసి ముచ్చట్లు పెట్టుకోవటమో చేస్తుంటారు. ఇవి కాకుండా ఇటీవల కాలంలో పెరిగిపోయిన మరికొన్ని పనుల్ని కావాలనే ప్రస్తావించలేదు. మిగిలిన రాష్ట్రమంతా ఒకలా ఉంటే హైదరాబాద్ మహానగర పరిస్థితి మరోలా ఉంటుంది.
వర్షం ఎంత ఎక్కువగా కురిస్తే.. కష్టాలు అంత ఎక్కువగా ఉంటాయి. అది బంజారాహిల్స్.. జూబ్లీహిల్స్ లో ఉన్న వారికైనా.. జవహర్ నగర్ శివారు ప్రాంతమైనా. దారుణంగా తయారైన రోడ్లు.. బయటకు అడుగు పెడితే.. ఇంటికి వచ్చే లోపు ఎన్నెన్ని ట్రాఫిక్ జాంలను ఎదుర్కోవాలో తెలీక కిందా మీదా పడే పరిస్థితి. అందుకే.. వర్షం పడే వేళలో.. తెలంగాణ రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే.. హైదరాబాద్ మహానగరంలోని వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి.
చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా ఇబ్బంది పడే వేళలో.. వారి మానాన వారిని వదిలేయకుంటే.. ప్రత్యేక ప్రెస్ మీట్ అంటూ మెసేజ్ వాట్సాప్ గ్రూపుల్లో పడేయటం ద్వారా.. చాలామందికి ఆదివారం అన్న ఫీలింగ్ ను పోగొట్టి.. చచ్చీ చెడీ ప్రగతిభవన్ కు పరుగులు తీస్తూ రావాల్సి ఉంటుంది. తాజాగా అలాంటి అనుభవమే మరోసారి అందరికి ఎదురయ్యేలా చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. మీడియాతో పాటు.. మీడియాలో పని చేసే వారికి.. వారికి అనుబంధంగా ఉన్న వారికి అదనపు పని తప్పని పరిస్థితి.
ఒక పవర్ ఫుల్ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నప్పుడు.. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు.. ఇతర సిబ్బందితో పాటు.. పార్టీకి సంబంధించి అందుబాటులో ఉన్న నేతల్ని ప్రగతి భవన్ కు పిలవటం.. వారంతా తమ కార్యక్రమాల్ని.. ఇళ్లను విడిచి పెట్టి పరుగులు తీయటం లాంటివి జరుగుతాయి. వర్షంలో తడుస్తూ.. ట్రాఫిక్ జాంలకు తిట్టుకుంటూ.. ప్రెస్ మీట్ సమయానికి చేరుకోవాల్సి ఉంటుంది.
ఇంతమందిని ఇంతలా ఇబ్బంది పెట్టి ప్రెస్ మీట్ పెట్టిన కేసీఆర్.. జనం ఎదుర్కొనే సమస్యలు.. ప్రజల కష్టాలకు చెక్ పెట్టేలా కార్యాచరణ కంటే కూడా.. ఇటీవల కాలంలో తనకు రాజకీయ ప్రత్యర్థి గా మారిన ప్రధాని మోడీ మీద ఎంతలా విరుచుకుపడాలో.. మరెన్ని యాంగిల్స్ లో ఆయన్ను తిట్టేందుకు ఉన్న అవకాశాల మీద బాగా స్టడీ చేసి మరీ ప్రెస్ మీట్ కు వచ్చే గులాబీ బాస్.. తన నోటికి పని చెప్పటంతో పాటు.. మందికి కూడా బాగానే పని పెట్టేశారని చెప్పాలి. ఎవరి మానాన వారిని వదిలేసి.. వర్షాలు తగ్గిన తర్వాత పెట్టేందుకు అవకాశం ఉన్నా.. దాన్ని వదిలేసి.. ఇంతలా ఆగమాగం చేయటంలో ఆనందమేమిటో అస్సలు అర్థం కాదు. మొత్తానికి గులాబీ బాస్ లొల్లి పుణ్యమా అని.. జనాలంతా ఆగమాగమయ్యే పరిస్థితి. ఎందుకిలా కేసీఆర్?