Begin typing your search above and press return to search.
కేసీఆర్.. సంచలన వ్యాఖ్యలపై సర్వత్రా విస్మయం.. క్లౌడ్ బరస్ట్‌పై తీవ్ర చర్చ
By: Tupaki Desk | 18 July 2022 2:30 AM GMTఓవైపు దేశాన్ని అల్లాడిస్తున్న భారీ వర్షాలు.. మరోవైపు వాటివల్ల వస్తున్న వరదలతో ప్రజలు ఆగమవుతున్నారు. ఇదంతా ప్రకృతి ప్రకోపానికి జరుగుతున్న పరిణామాలని.. ఇన్ని రోజులు భావిస్తున్నాం. అయితే.. ఈ భారీ వర్షాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన కారణంతో ఒక్కసారిగా అందరు అవాక్కయ్యారు. క్లౌడ్ బరస్ట్ అనే పద్ధతి వల్లే ఇంత విపత్తు జరుగుతుందని.. దానికి విదేశాలే కారణమని చెప్పటం అందరిలో ఆసక్తి రేకెత్తుతోంది. ఈ వ్యాఖ్యల్లో నిజమెంతుందో తెలియదు కానీ.. ఇంతకీ ఆ క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటీ..? దాని వెనకున్న అసలు కథేంటని రాజకీయ నేతలు చర్చ చేస్తున్నారు.
"క్లౌడ్ బరస్ట్" అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. కుండపోత వర్షాలకు ఏవో కొన్ని కుట్రలు ఉన్నట్లు చెబుతున్నారని.. కేసీఆర్ చేసిన ప్రకటన సంచలనాత్మకమైంది. గతంలోనూ జమ్మూకశ్మీర్‌లోని లేహ్, లద్దాఖ్.. ఉత్తరాఖండ్‌లో ఇలా చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు గోదావరి పరీవాహక ప్రాంతంపై కూడా అలా చేస్తున్నట్లు ఓ సమాచారం వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. కుండపోత వర్షాలను ఇప్పటివరకు.. ప్రకృతి ప్రకోపంగానే భావిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులెవరూ ఇప్పటి వరకు "క్లౌడ్ బరస్ట్ష కుట్ర అన్న వ్యాఖ్యలు చేయలేదు.
వాస్తవానికి క్లౌడ్ బరస్ట్ అంటే వాతావరణ శాక నిర్వచనం ప్రకారం... ఒక నిర్దేశించిన ప్రాంతంలో (ఒకటి నుంచి 10కిలోమీటర్ల లోపు వ్యాసార్ధంలో ) గంటకు 10సెంటీ మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షం నమోదైతే దాన్ని "క్లౌడ్ బరస్ట్``గా భావిస్తారు. కొన్ని సార్లు ఒకే ప్రాంతంలో ఎక్కువ సార్లు ఈ "క్లౌడ్ బరస్ట్ సంభవించే అవకాశం ఉంది. అంటే.. నిర్దేశిత ప్రాంతంలో కుండపోతగా ఎడతెరపి లేకుండా వర్షం కురవటం అన్నమాట. వాడుక బాషలో చెప్పాలంటే.. "మేఘానికి చిల్లు పడ్డట్టు" అంటుంటాం కదా.. అలా అన్నమాట.
క్లౌడ్ బరస్ట్ చేసిన దేశాలు ఇవే...!
2008 సంవత్సరంలో చైనా ప్రభుత్వం మొదటగా ఈ క్లౌడ్ బరస్ట్ ప్రయోగం చేసింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ సమయంలో స్టేడియాల లోపాలను పరిశీలించేందుకు క్లౌడ్ బరస్ట్ పద్ధతిని అనుసరించింది. బీజింగ్ ఒలింపిక్స్ ప్రారంభానికి ముందురోజు క్లౌడ్ బరస్ట్ ద్వారా భారీ కృత్రిమ వర్షాలను సృష్టించి అన్ని స్టేడియాలలో నీటి లీకేజీని పరీక్షించింది.