Begin typing your search above and press return to search.
కేసీయార్ తప్పుచేశారా ?
By: Tupaki Desk | 7 Aug 2022 12:30 PM GMTఅవును ఇప్పుడీ అంశంపైనే చర్చ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఆదివారం ఢిల్లీలో జరిగే నీతిఅయోగ్ సమావేశానికి హాజరు కాకూడదని డిసైడ్ అయ్యారు. నీతి ఆయోగ్ సంస్ధ ఒక నిరర్ధక సంస్ధగా మారిపోయింది కాబట్టే తాను సమావేశానికి వెళ్ళకూడదని డిసైడ్ అయినట్లు ప్రకటించారు. ఇక్కడే చాలామంది కేసీయార్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు.
మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపైన నీతి అయోగ్ పైన కేసీయార్ చాలా ఆరోపణలు, విమర్శలు చేశారు. అయితే ఈ ఆరోపణలు, విమర్శలను హైదరాబాద్ మీడియా సమావేశంలో చేసినందు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నీతి అయోగ్ లో జరుగుతున్న తప్పులు, కేంద్రప్రభుత్వ వైఖరిని నీతి అయోగ్ సమావేశానికి హాజరై అక్కడే అందరి ముందు చెప్పుంటే బాగుండేదని నెటిజన్లు సోషల్ మీడియాలో అభిప్రాయపడ్డారు.
సమస్య నీతిఅయోగ్ లోనే ఉన్నపుడు చెప్పేదేదో సమావేశానికి హాజరై చెప్పుంటే యావత్ దేశానికి తెలిసేది. కేసీయార్ తో పాటు ఇంకా చాలామంది ముఖ్యమంత్రులు హాజరయ్యే కార్యక్రమం కాబట్టి తాను చెప్పదలచుకున్న విషయాలను ఆ వేదికమీదే చెప్పుంటే బాగుండేదని నెటిజన్లు చెబుతున్నారు. ఒకవేళ నీతి అయోగ్ సమావేశంలో చెప్పటానికి అవకాశం రాకపోతే ఢిల్లీలోనే మీడియా సమావేశంలో చెబితే సరిపోయేదని నెటిజన్లు గట్టిగా అభిప్రాయపడ్డారు.
కేంద్రప్రభుత్వ వైఖరితో పాటు నీతిఅయోగ్ వ్యవహారాన్ని అందరు ముఖ్యమంత్రుల ముందు బయటపెట్టేందుకు వచ్చిన బంగారంలాంటి అవకాశాన్ని వదులుకుని కేసీయార్ పెద్ద తప్పుచేసినట్లు నెటిజన్లు అనుమానిస్తున్నారు.
కొంతమందైతే కేసీయార్ వైఖరిపై అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. మోడీ, నీతి ఆయోగ్ వైఖరిని నిరసిస్తూ సమావేశాన్ని బహిష్కరించటంలో అర్ధం లేదంటున్నారు. సమావేశానికి హాజరై తన అభిప్రాయాలను గట్టిగా చెప్పాల్సిన కేసీయార్ సమావేశాన్ని బహిష్కరించటంలో అర్ధమే లేదన్నారు. తనతో కలిసి వచ్చే ముఖ్యమంత్రులతో కేసీయార్ మాట్లాడుకుని అందరి మద్దతుతో నీతి అయోగ్ సమావేశంలో తాను చెప్పదలచుకున్న అంశాలను లేవనెత్తుంటే బాగుండేదని కూడా చెబుతున్నారు. మొత్తంమీద కేసీయార్ తాజా నిర్ణయంతో చాలామందే విభేదిస్తున్నారు.