Begin typing your search above and press return to search.

మునుగోడులో కేసీఆర్ స్పీచ్ లో అండర్ లైన్ చేసుకోవాల్సిన పాయింట్లు ఎన్నో

By:  Tupaki Desk   |   21 Aug 2022 5:05 AM GMT
మునుగోడులో కేసీఆర్ స్పీచ్ లో అండర్ లైన్ చేసుకోవాల్సిన పాయింట్లు ఎన్నో
X
ఎప్పటిలానే టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెలరేగిపోయారు. ఆయన మార్క్ మాటలు.. 'దొంగలు.. లంగలు', 'ఈడీ బోడీయే కాదు మోడీ.. ఏం పీక్కుంటావో పీక్కో'.. 'నువ్వు గోకకున్నా.. నిన్నుగోకుతూనే ఉంటా మోడీ' అంటూ మాటలు విసిరారు. అందరి అంచనాలకు భిన్నంగా ఎక్కువసేపు తన స్పీచ్ లేకుండా చూసుకున్న కేసీఆర్.. తన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యల్ని అండర్ లైన్ చేసుకొని చదువుకునేలా మాట్లాడటం గమనార్హం. సీఎం కేసీఆర్ ప్రసంగంలో అండర్ లైన్ చేసుకోవాల్సిన వ్యాఖ్యల్ని చూస్తే..

- మునుగోడులో బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారు. రైతులు జాగ్రత్తగా ఉండాలి. మీటర్లు పెడతామంటున్న మోదీ కావాలో.. వద్దంటున్న కేసీఆర్‌ కావాలో ప్రజలు తేల్చుకోవాలి. మునుగోడులో జరిగేది ఉప ఎన్నిక కాదు.. ప్రజల జీవితాల ఎన్నిక..
బతుకుదెరువు ఎన్నిక.

- రేపు మోదీ ఏమంటడు.. కేసీఆర్‌ మీటర్లు వద్దన్నవ్‌.. అయినా మునుగోడులో నాకే ఓటు వేసిన్రు.. నువ్వు జరిగిపో అని నన్ను పక్కకు నెట్టి మీటర్లు తెచ్చి పెడ్తడు. రైతులూ తస్మాత్‌ జాగ్రత్త. మీటర్లు వద్దనే కేసీఆర్‌ కావాలో, మీటర్లు పెట్టాలంటున్న మోదీ కావాలో తేల్చుకోండి.

- అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు? ఎర్రటి ఎండలో మిమ్మల్ని నిలబెట్టే పరిస్థితి ఎందుకొచ్చింది? దీని వెనుక మాయామశ్చీంద్ర ఏంది? గుర్తించకపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటది. అందుకే సీపీఐ నాయకులతో చెప్పిన. మనమంతా విడిపోయి ఉండటం కాదు.. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ప్రగతిశీల, క్రియాశీల శక్తులన్నీ ఏకం కావాలి. నిన్న.. మొన్న సీపీఐతో జరిగిన చర్చల్లో మాట్లాడుకున్నం. టీఆర్‌ఎ్‌సకు సీపీఐ మద్దతు పలికింది. నేడో రేపో సీపీఎం కూడా కలిసి రాబోతుంది. అందరం ఏకమవుతున్నం. భవిష్యత్తులోనూ సీపీఐ, సీపీఎం, టీఆర్‌ఎస్‌, ఇతర ప్రగతిశీల శక్తులన్నీ కలిసి పనిచేయాలి.

- ఈడీ కేసు పెడతమంటే.. ఈడీయా.. బోడియా.. రాబే.. అని నేనన్నా. ఈడీ వస్తే నా దగ్గర ఏమున్నది. వాళ్లే నాకు చాయ్‌ తాగిపిచ్చిపోవాల. దొంగలు, లంగలు భయపడ్తరు. ధర్మంగా, నిజాయితీగా ఉన్నోళ్లు ఎందుకు భయపడ్తరు?

- మీటర్లు పెట్ట అని ప్రధానితో కొట్లాడుతున్నానంటే.. నా బలం, ధైర్యం మీరే కదా! మీ బలంతోనే నేను కొడుతున్నా. మరి మీరే నన్ను బలహీనపరిస్తే నేనేం చేయాలి? మునుగోడు నియోజకవర్గ చరిత్రలో బీజేపీకి ఎన్నడూ డిపాజిట్‌ రాలే. ఇప్పుడూ రాకుండా చేయాలి.