Begin typing your search above and press return to search.
కేంద్రాన్ని కదిలిస్తే.. రాష్ట్రంలోనూ సమాధానం చెప్పాలేమో కేసీఆర్?
By: Tupaki Desk | 4 Sep 2022 4:14 AM GMTవీలైనంతవరకు కొన్ని విషయాల్ని కదిలించకపోవటమే మంచిది. లోతుల్లోకి వెళ్లే కొద్దీ లేనిపోని తిప్పలు ఖాయం. కేంద్రానికి రాష్ట్రాలు చెల్లించే పన్నుల విషయం మీద ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు.. కేటీఆర్.. హరీశ్ రావులు సైతం అదే పనిగా ప్రస్తావిస్తున్నారు. వారి వాదన మొత్తాన్ని చూస్తే.. దేశంలో ఐదారు రాష్ట్రాలు ఇచ్చే పన్ను ఆదాయంతో దేశంలోని మిగిలిన రాష్ట్రాలు బండి లాగుతున్నాయని. ఈ వాదన విన్నంతనే బాగున్నట్లుగా అనిపిస్తుంది కానీ.. ఇలాంటివి సమైక్యతా భావాల్ని దెబ్బ తీయటమే కాదు.. ఆర్థికంగా బలహీనంగా ఉండే రాష్ట్రాల్ని చిన్నచూపు చూసినట్లుగా అనిపించటం ఖాయం.
కేంద్రానికి పన్ను రూపంలో భారీగా ఆదాయాన్ని ఇచ్చే రాష్ట్రాలకు పెద్ద పీట వేయాలన్న వాదాన్ని తెర మీదకు తీసుకొస్తే ఇబ్బందులకు గురయ్యేది కేసీఆర్ అండ్ కో అనే మాట వినిపిస్తోంది. ఈ మాటకు బలాన్ని చేకూరేలా ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక చురక వేశారు కూడా. పన్ను ఆదాయాన్ని ఎక్కువగా ఇచ్చే రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న మంత్రులు కేటీఆర్.. హరీశ్ రావు వాదనలకు దిమ్మతిరిగే కౌంటర్ వేశారు.
తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక ఆదాయాన్ని ఇచ్చే హైదరాబాద్ కు పెడుతున్న ఖర్చు ఎంత? మారుమూల ఉన్న అదిలాబాద్ జిల్లా నుంచి వచ్చే ఆదాయం.. అక్కడ పెట్టే ఖర్చు మాటేమిటి? అన్న విషయాన్ని ఆమె ప్రశ్నించారు. తాను ఉదాహరణగా చెబుతున్నానంటూనే.. తాను చెప్పాల్సిన విషయాన్ని చెప్పేశారు. ఇదే విషయాన్ని నిర్మలా సీతారామన్ మాటల్లో చెప్పాలంటే.. 'తెలంగాణలో 50-55 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచి వస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని అదిలాబాద్ లో ప్రాజెక్టుకు కేటాయిస్తారు కదా. మరి హైదరాబాద్ వాళ్ల పేరుతో ప్రాజెక్టు నడుపుతారా? ఇక్కడ ఎంపీ ఫోటో పెట్టి నడుపుతారా?' అని ప్రశ్నించారు.
నిర్మలా సీతారామ్ వాదన టీ మంత్రులు కేటీఆర్.. హరీశ్ రావులకు కౌంటర్ ఇచ్చినట్లుగా ఉండటమేకాదు.. ఫోటో ఇష్యూలో కూడా తనదైన సమాధానాన్ని ఇచ్చేశారని చెప్పాలి. అదే సమయంలో.. పన్ను ఆదాయాన్ని కొన్ని రాష్ట్రాలు ఎక్కువగా ఇచ్చినప్పటికి.. వారికే పెద్ద పీట వేసే కన్నా.. ఒక విధానం ప్రకారం ఖర్చు చేయటం అనే అంశాన్ని చెప్పుకొచ్చారు. కేటీఆర్.. హరీశ్ లు ఇప్పుడు ప్రస్తావిస్తున్న అంశాల్నే రేపొద్దున హైదరాబాద్ లోని వారు ఇదే వాదనను వినిపిస్తూ.. నగరం నుంచి జనరేట్ అయ్యే పన్ను ఆదాయంలో సింహభాగం ఇక్కడే ఖర్చు పెట్టాలని డిమాండ్ చేస్తే.. పరిస్థితి ఏమవుతుంది? అన్నదిప్పుడు ప్రశ్న. అందుకే.. కొన్ని విషయాల్ని వీలైనంతవరకు టచ్ చేయకుండా ఉండటం మంచిదని చెప్పాలి. ఆ విషయాన్ని కేసీఆర్ అండ్ కో ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిదన్న మాట వినిపిస్తోంది.