Begin typing your search above and press return to search.
కేసీఆర్ స్కెచ్ వేస్తే అంతే..కన్నడిగుల షాక్..
By: Tupaki Desk | 11 Sep 2022 10:25 AM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ స్కెచ్ వేస్తే అంతే ఉంటుంది. ఆయన ఎవరి ఊహలకు అందకుండా ఎత్తులు వేస్తుంటారు. కేసీఆర్ స్కెచ్ కు తాజాగా కర్ణాటక ప్రజల మైండ్ బ్లాంక్ అయిపోయిన పరిస్థితి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంతో కయ్యానికి కాలుదువ్వుతున్న కేసీఆర్ ఈ మేరకు రంగం సిద్ధం చేస్తున్నారు. భారత మాజీ ప్రధాని హెచ్.డీ దేవేగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం హెచ్.డీ కుమారస్వామితో తాజాగా కేసీఆర్ హైదరాబాద్ లో భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కుమారస్వామి మాజీ సీఎం హోదాలో ఎక్కడికి వెళ్లినా సాధారణ భద్రతనే ఉంటుంది. అయితే హైదరాబాద్ వెళ్లిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి తెలంగాణ ప్రభుత్వం జెడ్ + కేటగిరి భద్రత ఏర్పాటు చేయడం కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ స్కెచ్ వెనుక అసలు కథ గురించి తెలుసుకున్న కన్నడిగులు షాక్ అవుతున్నారు.
కేంద్రంలోని మోడీ సర్కార్ ను దించడానికి ఇటీవల శపథం చేసిన కేసీఆర్ ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తున్నారు. ఇటీవల కాలంలో ఢిల్లీతోపాటు ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులను కూడా కలుస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ స్కెచ్ లను కొందరు రాజకీయ నాయకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
భారత మాజీ ప్రధాని హెచ్.డీ దేవేగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ సీఎం హెచ్.డీ కుమారస్వామి ఎక్కడ జెడ్ + భద్రత దక్కలేదు. కానీ కుమారస్వామికి తెలంగాణ ప్రభుత్వం ఆ కేటగిరిగి భద్రత కల్పించింది. నిన్న రాత్రి కుమారస్వామి కర్ణాటక నుంచి హైదరాబాద్ వచ్చారు. శనివారం అర్ధరాత్రి 12.15 గంటలకు విమానాశ్రయంలో దిగారు. విమానశ్రయం నుంచి హెచ్.డి కుమారస్వామికి తెలంగాణ ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది. విమానాశ్రయం నుంచి ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్ చేరుకున్న ఆయన అక్కడే బస చేశారు.
ఈ మధ్యాహ్నం కుమారస్వామి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ చేరసుకొని కీలక చర్చలు జరుపుతున్నారు. జాతీయ రాజకీయాలపై చర్చలు జరుపుతున్నారు. సాయంత్రం ఈ చర్చలు జరుగనున్నాయి.
బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ పార్టీల నాయకులు అందరినీ ఏకం చేయడానికి కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బీహార్ సీఎం నితీశ్ కుమార్ తోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. ఈక్రమంలోనే వారికి అమిత ప్రాధాన్యం ఇస్తూ వారిని ఆకట్టుకునే చర్యలను కేసీఆర్ చేపడుతున్నారు.