Begin typing your search above and press return to search.

మరో సంచలనం దిశగా కేసీఆర్.. రేపు ఏం జరుగునుంది?

By:  Tupaki Desk   |   11 Sep 2022 10:33 AM GMT
మరో సంచలనం దిశగా కేసీఆర్.. రేపు ఏం  జరుగునుంది?
X
తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు జాతీయ స్థాయికి పడడానికి చూస్తున్నాయి. ఇప్పటికే దసరాకు జాతీయ పార్టీని ప్రకటించడానికి రెడీ అయిన కేసీఆర్ ఈ మేరకు రంగం సిద్ధం చేస్తున్నారు. కీలక రాజకీయ చర్చలు జరుపుతున్నారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని హైదరాబాద్ రప్పించి మరీ చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాలు పెడుతుండడంతో కీలక ప్రకటన దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

సోమ, మంగళవారాల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఈ రెండు రోజులలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తాజాగా స్పీకర్ పైన చేసిన వ్యాఖ్యల విషయంలో సభాపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠ రేపుతోంది.

ఇప్పటికే మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పీకర్ పైన వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్ క్షమాపణలు చెప్పాలని.. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనికి ఈటల తాను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.

కేంద్రంపైన ఫైట్ కు దిగిన కేసీఆర్ ఈ మేరకు అసెంబ్లీలో కేంద్రం తీరును ఎండగడుతూనే తెలంగాణ నమూనా దేశానికి అవసరం అన్న వాదనను తెరపైకి తీసుకురాబోతున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలన్న ఆలోచనతోనే కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేయబోతున్నట్టు సమాచారం. త్వరలోనే జాతీయ పార్టీ ప్రకటనకు సన్నాహాలు చేస్తున్నారు.అందులో భాగంగానే రానున్న రెండు రోజుల సమావేశాలను కేసీఆర్ సద్వినియోగం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రం విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరిని ఎండగట్టడమే లక్ష్యంగా సమావేశాలు జరుగనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం-రాష్ట్రం అంశాలపైనే రెండు రోజుల పాటు చర్చ సాగే అవకాశం ఉంది. జాతీయరాజకీయాల దిశగా కేసీఆర్ అడుగుల నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అందుకు అనుగుణంగా సభలో వాణి వినిపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంఐఎం, కాంగ్రెస్ ప్రతిపాదించిన అంశాలపైనా సభలో చర్చంచి కేంద్రంను ఎండగట్టాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. ఎఫ్ఆర్.బీఎం పరిధిని కోసేసి అప్పు పుట్టకుండా చేసిన కేంద్రం తీరుపై కడిగేయడానికి కేసీఆర్ రెడీ అయ్యారు. సభ వేదిక ద్వారానే కేంద్రాన్ని ఎండగట్టడానికి కేసీఆర్ స్కెచ్ గీశారు. ఈ మేరకు అసెంబ్లీలో కీలక ప్రకటనల దిశగా కదులుతున్నారు.