Begin typing your search above and press return to search.
ఇన్నాళ్లకు జై తెలంగాణకు మరో నినాదం చేర్చిన కేసీఆర్
By: Tupaki Desk | 2 Oct 2022 3:30 AM GMTటీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేయటం కోసం ఆయన ఎంతకైనా అన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఎవరూ అంచనా కూడా వేయని అంశాల్ని టేకప్ చేయటం.. వాటిని అందరి అంచనాలకు భిన్నంగా పూర్తి చేసే ధోరణి కాస్తంత ఎక్కువే. గడిచిన కొద్ది కాలంగా జాతీయ రాజకీయాల మీద ఫోకస్ చేసిన ఆయన గురించి తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోడీతో మొదలైన పంచాయితీ.. అటు ఇటు తిరిగి చివరకు జాతీయ పార్టీ పెట్టే వరకు వెళ్లింది. తొలుత కేంద్రంలో కాంగ్రెస్.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా మరో కూటమిని తెర మీదకు తీసుకురావాలని ప్రయత్నించినా.. అవేమీ సాధ్యం కాని సంగతి తెలిసిందే. దీంతో.. కొత్త జట్టు కట్టే కన్నా.. కొత్తగా పార్టీనే పెట్టేస్తే సరిపోతుందన్న ఆలోచనతో జాతీయ రాజకీయ పార్టీని షురూ చేస్తున్నారు. ఇందుకు దసరాను ముహుర్తంగా పెట్టుకున్నారు.
ఇందులో భాగంగా వరుస పెట్టి అంతర్గత సమావేశాల్ని ఏర్పాటు చేస్తున్న కేసీఆర్.. పలువురితో భేటీ అవుతున్నారు. సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. సన్నాహాకాల్ని ముమ్మరం చేస్తున్నారు. ఒకవైపు దీనికి సంబంధించిన ప్రిపరేషన్ జరుగుతుంటే.. మరోవైపు వివిధ జిల్లాల్లో ఆయన తన సెంటిమెంట్ పర్యటల్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం యాదాద్రి వెళ్లిన కేసీఆర్.. శనివారం వరంగల్ జిల్లాలో పర్యటించారు.
ఇంతకాలం తాను ఎక్కడ.. ఏ సభను నిర్వహించినా.. ఆరంభంలోనూ.. చివర్లోనూ ఆయన నోటి నుంచి ''జై తెలంగాణ'' అన్న నినాదం రావటం తెలిసిందే. తాజాగా ఆ నినాదానికి తోడుగా మరో నినాదం కూడా ఆయన నోటి నుంచి వచ్చింది. జై తెలంగాణతో పాటు జై భారత్ అన్న నినాదాన్ని వినిపించటం ద్వారా జాతీయ పార్టీపై ఆయన స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు.