Begin typing your search above and press return to search.
కేసీఆర్ కారణంగా తెలంగాణ రావటం ఏంటి? పెద్దాయన ఘాటు వ్యాఖ్య
By: Tupaki Desk | 13 Dec 2020 9:53 AM GMTతెలంగాణ రాష్ట్రం తన వల్లనే ఏర్పడిందన్న మాట తరచూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కమ్ టీఆర్ఎస్ అధినేత నోటి నుంచి రావటం తెలిసిందే. తెలంగాణకు సంబంధించి చాంపియన్ తానేనని చెప్పుకునే కేసీఆర్ వ్యాఖ్యల్ని తాజాగా ఒక పెద్దాయన తీవ్రంగా తప్పు పడుతున్నారు. కామెడీ కాకపోతే.. తెలంగాణ కేసీఆర్ కారణంగా రావటం ఏమిటి? అని మండిపడుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? ఎందుకంత ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారన్న విషయంలోకి వెళితే..
తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో 1969లో జరిగిన ఉద్యమాన్ని ఒక ల్యాండ్ మార్కుగా చెబుతారు. తొలిసారి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున తెర మీదకు వచ్చింది. ఆ సమయంలో ఉద్యమంలో పాలు పంచుకున్న వారంతా కలిసి 1969 ఉద్యమకారుల సమితిని ఏర్పాటు చేశారు. ఆ సమితికి అధ్యక్షుడిగా మేచినేని కిషన్ రావు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదన్న ముఖ్యమంత్రి మాటల్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.
‘అసలు కేసీఆర్ ఉద్యమకారుడు కాదు. తన వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పటం హాస్యస్పదంగా ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1969లోనే బీజం పడింది. తెలంగాణ సాధన సమితి.. తెలంగాణ తల్లి ఇలా వందలాది ఉద్యమ సంస్థలు ఏర్పడి పోరాటం చేశాయి’ అని చెప్పారు. అప్పట్లోనే 369 మంది ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేసిన కిషన్ రావు.. ‘మలిదశ ఉద్యమంలో మంత్రి హరీశ్ రావు మధ్యవర్తిత్వం వహించగా.. ఉద్యమ సంస్థలన్ని ఒక్కదగ్గరకు చేరాయి. కాళోజీ నారాయణరావు సలహాతో అందరూ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశాం. కేసీఆర్ అధ్యక్షుడిగా.. ప్రధాన కార్యదర్శిగా నేను వ్యవహరించాం’ అని వెల్లడించారు.
విద్యార్థులు.. విద్యార్థి సంఘాలు.. న్యాయవాదులు ఇలా అన్ని వర్గాల వారు తెలంగాణ కోసం పోరాడారని.. వారందరి పోరాటాల ఫలితమే తెలంగాణ ఏర్పడిందన్న విషయాన్ని ఆయన గర్తు చేయటం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర సాధన తన ఒక్కడి కారణంతోనే అన్న క్రెడిట్ కేసీఆర్ కు ఇచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరని చెప్పాలి. మరి.. దీనిపై గులాబీ బాస్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.