Begin typing your search above and press return to search.
ఆ సత్తా నీకొక్కడికే ఉంది కేసీఆర్
By: Tupaki Desk | 10 Nov 2015 4:23 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ది నిజంగా విశిష్టమైన వ్యక్తిత్వం. తెలంగాణ ఉద్యమకారుడిగా తనదైన పంథాలో రాష్ర్టం కోసం పోరాటం చేసిన కేసీఆర్....మహామహులను సైతం తిప్పలు పెట్టే ఎత్తుగడలు వేశారు. తను అనుకున్న లక్ష్యమైన తెలంగాణను సాధించారు. తెలంగాణ పాలకుడిగా కేసీఆర్ పగ్గాలు చేపట్టిన తర్వాత వినూత్న పంథాలో పరిపానలో ముందుకు వెళుతున్న కేసీఆర్ తాజాగా మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. కొలువుల భర్తీలో భాగంగా పెద్ద ఎత్తున పోలీసు ఉద్యోగాలను ప్రకటించిన కేసీఆర్... ఇదే నోటిఫికేషన్ లో ప్రభుత్వం తరఫున నిరుద్యోగులకు అనేక శుభవార్తలు అందించారు.
పోలీస్ పోస్టుకు ఏజ్ బార్ అయిపోతుందని బాధపడుతున్న నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. పోలీస్ ఉద్యోగాల్లో సహజంగా వయోపరిమితి సడలింపు ఉండదు. కానీ తెలంగాణలో పోలీస్ ఉద్యోగ నియమకాల్లో సైతం ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఎస్ ఐ - కానిస్టేబుల్ పోస్టులకు మూడేళ్లు వయోపరిమితి పెంచే ఫైల్‌పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.
దీంతో ఇప్పటి వరకు జనరల్ కేటగిరీలో కానిస్టేబుళ్ల నియామకానికి 22 ఏళ్లు - ఎస్సీ - ఎస్టీ - బీసీలకు 27 ఏళ్ల వయోపరిమితి ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో.. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 25 ఏళ్లు.. ఎస్సీ - ఎస్టీ - బీసీలు 30 ఏళ్లు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కలిగింది. ఎస్ ఐ పోస్టులకు ప్రస్తుతం జనరల్ కేటగిరిలో 25 ఏళ్లు.. ఎస్సీ - ఎస్టీ - బీసీలకు 28 ఏళ్లు ఉంది. వారికి కూడా మూడేళ్లు సడలింపు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. మరోవైపు దీంతోపాటు పోలీసు శాఖలోని కమ్యూనికేషన్ విభాగాన్ని కూడా పటిష్టం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. పోలీస్ కమ్యూనికేషన్ విభాగంలో విభజన తర్వాత రాష్ట్రానికి 335 కానిస్టేబుల్ పోస్టులు వచ్చాయి. ఇందులో కేవలం ముగ్గురు మాత్రమే కానిస్టేబుళ్లు ఉన్నారు. ఇంకా 332 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా ఒకేసారి భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతోపాటు సివిల్ పోలీసుల నియామకంలో తప్పనిసరిగా 33.33శాతం రిజర్వేషన్ మహిళలకు కేటాయించాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్మ్ డ్ పోలీసుల నియామకంలోనూ మహిళలకు 10 శాతం కోటా కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు.
వీటన్నింటికంటే ముఖ్యంగా దేహదారుడ్య విధానంలో కేసీఆర్ పలు మార్పులు చేశారు. గతంలో పురుషులకు 5 కిలోమీటర్ల పరుగుపందెం, మహిళలకు 2.5 కిలోమీటర్ల పరుగుపందెం ఉండేది. ఇప్పుడు కేసీఆర్ వాటిని తొలగించారు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ప్రక్రియలో కూడా మార్పులు చేశారు. పురుషులు మొత్తం 5 విభాగాల్లో అంటే షాట్ పుట్ - హైజంప్ - లాంగ్ జంప్ - 100 మీటర్ల పరుగు - 800 మీటర్ల పరుగులో ఖచ్చితంగా ప్రతిభ చూపించాలి. కానీ 800 మీటర్ల పరుగుతో పాటు ఏవేనీ రెండింటిలో ప్రతిభ చూపిస్తే చాలు. మహిళల విషయంలో 100 మీటర్ల పరుగు - హైజంప్ - లాంగ్ జంప్ మాత్రమే ఉంటాయి. వీటిలో 100 మీటర్ల పరుగులో ప్రతిభ చూపిస్తే సరిపోతుంది.
యువతలో ముఖ్యంగా ప్రభుత్వ కొలువులకు రావాలనుకుంటున్న వారికోసం ఆలోచించి తనదైన శైలిలో నిర్ణయం తీసుకోవడంలో తనకు తానే సాటి అని మరోమారు కేసీఆర్ నిరూపించారు.