Begin typing your search above and press return to search.
కాంగ్రెస్ లో కొత్త ట్రెండ్..ఓడినోళ్లే పోటీకి రెడీ
By: Tupaki Desk | 20 Dec 2018 8:02 AM GMTతెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ట్రెండ్ మొదలైంది. అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో భారీ విజయంపై భరోసా పెట్టుకున్నా ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. ఖచ్చితంగా విజయం సాధిస్తామనుకున్న సీనియర్ నేతలంతా ఓడిపోయారు. దీంతో పార్టీ షాక్‌కు గురైంది. ఈ అపజయాన్ని నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే, వెంటనే తదుపరి కార్యాచరణ మొదలుపెట్టారు. ఫిబ్రవరి చివరి వారంలో పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ రాబోతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్ని కల్లో ఓడినోళ్లంతా పార్లమెంటు బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. ఓడిపోయినా ఎంపీ టికెట్ తమకేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, సీనియర్లు మొత్తం అవకాశాలు కైవసం చేసుకుంటే...తమ సంగతి ఏంటనే సందేహం వ్యక్తమవుతోంది.
తాజాగా జరిగిన ఎన్నికల్లో 'కాంగ్రెస్ వస్తోంది' అన్న నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన సీనియర్ నేతలను ప్రజలు తిరస్కరించారు. ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఎంతో మంది సీనియర్ నేతలను సైతం ఉహించని రీతిలో మట్టికరిచారు. అయితే, టికెట్లు ఆశిస్తున్న మాజీ ఎంపీలతోపాటు కొంత మంది మాజీ మంత్రులు - మాజీ ఎమ్మెల్యేలు సైతం హస్తినపై ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి పార్టీ నేతలంతా దిక్కుతోచని స్థితిలో ఉంటే...మరోవైపు పార్లమెంటు ఎన్నికల్లో తమకు పోటీ చేసే అవకాశాన్ని ఇవ్వాలని మాజీ ఎంపీలు కోరుతున్నట్టు కాంగ్రెస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా అసెంబ్లీ బరిలోకి దిగేం దుకు ఎంతో మంది సీనియర్లు పోటీ పడ్డారు. దాదాపు మూడువేలకు పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థుల పోటీ ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం పార్టీ నేతల్లో పెరిగింది. పార్టీ అధికారంలోకి వస్తే తమకు ఉన్న సీనియార్టీ కొత్త ప్రభుత్వంలో మంత్రి అయ్యే అవకాశం వస్తుందన్న ముందుచూపుతోనే అసెంబ్లీ బరిలోకి దిగారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్ నేతలను ప్రజలు పార్లమెంటుకు పంపిస్తారా? అన్న చర్చ జరుగుతున్నది. ఓటమి నుంచి బయటపడక ముందే పోటీకి సై అనడం పట్ల పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. పాత వారికి టికెట్లు ఇచ్చి ఓడిపోయే కంటే కొత్త వారికి చాన్స్ ఇచ్చి పార్టీ ప్రతిష్టను పెంచాలని కోరుతున్నారు. పార్టీకి సవాల్ గా మారిన పంచాయతీ ఎన్నికలపై దృష్టిసారిం చకుండా పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం పట్ల ఆ పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. ఎంపీలుగా పోటీ చేస్తామంటున్న నేతలు ఈ ఎన్నికల్లో తమ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. రేవంత్ రెడ్డి మినహా ఏ ఒక్కరూ ఇతర నియోజకవర్గాలల్లో ప్రచారం నిర్వహించలేదు. పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి రేసులో ఉన్న నేతలు కూడా తమ నియోజకవర్గ పరిధి దాటి వెళ్లలేదు.అటువంటి నాయకులంతా ఎంపీ టికెట్ ఇస్తే ఎలా గెలుస్తారని జూనియర్లు ప్రశ్నిస్తున్నారు.
మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్ - సురేష్ షెట్కర్ - రమేష్ రాథోడ్ - కేంద్ర మాజీ మంత్రులు సర్వే సత్య నారాయణ - బలరాంనాయక్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేం దుకు చేసేందుకు మళ్లీ ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర మాజీ మంత్రులు - కె జానారెడ్డి - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - డికె అరుణ - సునీతా లక్ష్మారెడ్డి - దామోదర రాజనర్సింహ - గీతా రెడ్డి వంటి సీనియర్ నేతలు ఓటమి బాట పట్టారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు - మాజీ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్ రెడ్డి ఉహించని రీతిలో పరాజయాన్ని మూటకట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలంతా పార్లమెంటుకు పోటీ చేయాలనే తలంపుతో అప్పుడే పావులు కదుపు తున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగంగా ప్రకటించగా...రేవంత్ రెడ్డి తన సన్నిహితులతో చర్చిస్తున్నట్టు తెలిసింది.