Begin typing your search above and press return to search.
సారును తప్పు పట్టే హస్తం నేతలకు గతం గుర్తుకు లేదా?
By: Tupaki Desk | 1 March 2020 4:28 AM GMTసంక్షేమ పథకాల అమలుతో ఖాళీగా మారిన ఖజానాను నింపుకోవటానికి ఏం చేయాలన్నది ఇప్పుడు పలు రాష్ట్ర ప్రభుత్వాల ముందున్న సవాలు. పన్నులు పెంచితే ప్రజలు ఊరుకోరు. అలా అని భారీ ఖర్చుగా మారిన సంక్షేమ పథకాల్ని నిలిపేస్తే మొదటికే మోసం. ఇలాంటివేళ.. ఎవరికి ఇబ్బంది లేని రీతిలో ఖజానాకు కాసుల కళ రావాలంటే భూములు అమ్మటానికి మించిన ఆలోచన ఇంకేం ఉంటుంది.
తాను తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణ ఏర్పడినప్పుడున్న మిగులు బడ్జెట్ కాస్తా.. ఇప్పుడు లోటుగా మారటమే కాదు.. తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటోంది టీఆర్ ఎస్ సర్కారు. వందల కోట్లను అలవోకగా ప్రకటించే సీఎం కేసీఆర్ నోటి నుంచి వంద రూపాయిలు తీయాలంటే వెయ్యి రూపాయిలుగా కనిపిస్తుందన్న మాట రావటం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎంత దైన్యంగా ఉందన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది.
దీంతో పెద్ద ఎత్తున సమావేశాల్ని నిర్వహించి.. పలు రంగాలకు సంబంధించిన నిపుణులతో చర్చల తర్వాత.. ప్రభుత్వ భూములు అమ్మాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్. అదే విషయాన్ని మీడియా సమావేశంలోనూ వెల్లడించారు. అయితే.. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.
ప్రభుత్వ భూముల్ని అమ్మి ఖజానాను నింపాలని చూస్తే.. తాము చూస్తూ ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చింది. పేదలకు.. భావితరాలకు చెందాల్సిన భూముల్ని అమ్మాలని చూస్తే అడ్డుకొంటామని కాంగ్రెస్ నేతలు అల్టిమేటం జారీ చేశారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న హెచ్చరికలకు ఘాటుగా రియాక్ట్ కావాలని గులాబీ నేతలు సిద్ధమవుతున్నారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ భూముల్ని పెద్ద ఎత్తున అమ్మి.. ఖజానాను నింపుకున్న వైనాన్ని గుర్తు చేసి.. ఉతికి ఆరేసేలా వాదనను సిద్ధం చేసుకుంటున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించే కాంగ్రెస్ నేతల ద్వంద వైఖరి.. ఆ పార్టీకి శాపంగా మారిందంటున్నారు. మొత్తంగా భూముల్ని అమ్మి ఖజానాను నింపాలన్న అంశంపై కేసీఆర్ సర్కారును తప్పు పట్టేలా ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్ కు భంగపాటు తప్పదన్న మాట వినిపిస్తోంది. గతం వారికి శాపంగా మారుతుందంటున్నారు.