Begin typing your search above and press return to search.
భువనగిరిలో `ఒకే ఒక్కడు`ఎవరో?
By: Tupaki Desk | 26 July 2018 2:06 PM GMTసాధారణంగా సార్వత్రిక ఎన్నికలైనా....ఉప ఎన్నికలైనా.....ప్రతి పార్టీకి...దాదాపుగా ప్రతిపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురువుతోంది. అయితే, అంతకన్నా ముందే సొంతపార్టీలో టికెట్ల కుమ్ములాటల రూపంలో ప్రతిపక్షాల కన్నా ఎక్కువ ఒత్తిడిని దాదాపుగా ప్రతిపార్టీ ఎదుర్కోవాల్సిందే. 2019 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో టికెట్ల లొల్లి మొదలైంది. ఎన్నికల సమయంలో టికెట్ల కోసం పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు తెరతీసే ఆశావహులు........తమ పైరవీలను మొదలెట్టారు. తెలంగాణలోని ఓ ఎంపీ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ వార్ మొదలైందని తెలుస్తోంది. ఎన్నికల సమరాన్ని తలదన్నేతా ఉన్న ఈ వార్ కు చెక్ పెట్టేందుకు ఈ సారి ఎంపీ అభ్యర్థులను ముందుగానే ప్రకటించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతోందట.
భువనగిరిలో కాంగ్రెస్ కు గట్టి పట్టుంది. దీంతో , ఈ సారి ఎన్నికలలో .... టికెట్ నాదంటే నాదంటూ తాజా - మాజీ నేతలంతా లొల్లి చేస్తున్నారట. ఈ సారి ఎలాగైనా గెలుస్తానని....కోమటి రాజగోపాల్ రెడ్డి ధీమాతో ఉన్నారట. అంతేకాదు, తాను సూచించిన వారికే....ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని.....అధిష్టానానికి ఆల్రెడీ చెప్పారట. మరోవైపు, పొన్నాల...కూడా...గతంలో జనగాంలో ఓటమిపాలయ్యారు. దీంతో, ఈ సారి భువనగిరిలో....బీసీ కోటాలో టికెట్ కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు మొదలు పెట్టారట. మరో సీనియర్ నేత - మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డి ఏఐసీసీ సభ్యుడి హోదాలో టికెట్ ఆశిస్తున్నారట. పీసీసీ అధికార ప్రతినిధి...శ్రవణ్...కూడా భువనగిరి ఎంపీ టికెట్ కోసం పావులు కదుపుతున్నారట. మరోవైపు, పీసీసీ కోశాధికారి నారాయణ్ రెడ్డి కూడా టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. తమకే విజయావకాశాలున్నాయని ...బల ప్రదర్శన చేస్తున్నారట. మరి హైకమాండ్ టికెట్ ఇవ్వబోయే ఆ ఒకే ఒక్కడికి ....మిగతా ఆశావహులు .ఏమాత్రం సహకరిస్తారో అన్నది చర్చనీయాంశమైంది.