Begin typing your search above and press return to search.

కేసీఆర్ చిట్టా విప్పిన కాంగ్రెస్ నేత‌లు..!

By:  Tupaki Desk   |   2 July 2019 4:34 AM GMT
కేసీఆర్ చిట్టా విప్పిన కాంగ్రెస్ నేత‌లు..!
X
మూకుమ్మ‌డి ఒకే అంశం మీద మాట్లాడ‌టం పాత ప‌ద్ధ‌తిగా మారిపోయింది. ఉన్న ప‌దిమంది ఎవ‌రికి వారు ఒక్కో విషయాన్ని హైలెట్ చేయ‌టం.. అధికార పార్టీని.. రాష్ట్ర ముఖ్య‌మంత్రిని విమ‌ర్శ‌ల‌తో క‌డిగేసే కొత్త ప‌ద్ద‌తిని తెర మీద‌కు తీసుకొచ్చారు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు. తాజాగా త‌మ చేత‌ల్లో చూపిస్తూ.. తెలంగాణ సీఎంను క‌డిగిపారేసే ప‌నిని విజ‌య‌వంతంగా పూర్తి చేశారు.

తాజాగా సెక్ర‌టేరియ‌ట్ ను కూల్చేయాల‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్న కేసీఆర్ వైఖ‌రిని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.మ‌రో వందేళ్ల వ‌ర‌కూ ఢోకా లేని సచివాల‌యం భ‌వ‌నాల్ని కూల్చేసి..కొత్త భ‌వ‌నాల్ని నిర్మిస్తామ‌న్న వైనంపై ప‌లువురు తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. నీళ్లు.. నిధుల కోసం తెచ్చుకున్న తెలంగాణ నేడు న‌లుగురి మ‌ద్య ఉండిపోయింద‌ని మండిప‌డుతున్నారు.

తాజాగా సెక్ర‌టేరియ‌ట్ వ‌ద్ద‌కు సంద‌ర్శ‌న‌గా వ‌చ్చిన తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు.. సీఎం కేసీఆర్ తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. శిలాఫ‌ల‌కాల మీద త‌న పేరు ఉండాల‌న్న త‌ప‌న‌తోనే కేసీఆర్ కొత్త భ‌వ‌నాల నిర్మాణం పేరుతో నిధుల్ని దుర్వినియోగం చేస్తున్న‌ట్లుగా విమ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ప‌లు ప్ర‌శ్న‌ల్ని సంధించారు. వాటిల్లో ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్ప‌లేని పరిస్థితి ఉండ‌టం గ‌మ‌నార్హం.

టీ కాంగ్రెస్ నేత‌లు సంధిస్తున్న ప్ర‌శ్న‌ల్ని చూస్తే..

+ ఉమ్మడి రాష్ట్రంలో సీఎం - 42 మంది మంత్రులు - 294 మంది ఎమ్మెల్యేలతో పాలన సాగిన సచివాలయం - అసెంబ్లీ ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలకు సరిపోవడం లేదా?

+ 1980లో మర్రి చెన్నారెడ్డి హయాంలో కొన్ని భవనాలు నిర్మిస్తే - 2012 - 2013లో కొన్నింటిని నిర్మించారు. వీటిని నిర్మించి 30 ఏళ్లు కూడా దాటలేదు. అలాంటి వాటిని కూల్చివేసి కొత్త‌వి క‌ట్టాల‌నుకోవ‌టం దుర్మార్గం కాదా?

+ ఇంత పెద్ద సచివాలయంలో ఇప్పటికే అనేక భవనాలు ఖాళీగా ఉన్నాయి. మ‌ళ్లీ కొత్త‌వి క‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. చిన్న చిన్న మ‌ర‌మ్మ‌తుల‌తో వాటిని సరి చేసుకోలేరా? కూల్చేడే స‌మాధాన‌మా?

+ ప్ర‌జ‌లు ఎన్నుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్.. త‌న‌కు తాను మ‌హారాజు.. చ‌క్ర‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించ‌టం ఏమిటి?

+ ప్ర‌జాధ‌నం దుర్వినియోగం చేయ‌టం త‌ప్పు కాదా? కొత్త భ‌వ‌నాల పేరుతో ప్ర‌జాధ‌నాన్ని ఎలా దుర్వినియోగం చేస్తారు?

+ కేసీఆర్ మూఢ న‌మ్మ‌కాల‌కు తెలంగాణ ప్ర‌జ‌లు మూల్యం చెల్లించాలా?

+ నేడు రూ.400 కోట్లు అని చెబుతున్న కేసీఆర్ ఆ ఖ‌ర్చును రూ.2వేల కోట్ల వ‌ర‌కు తీసుకెళ్ల‌ర‌న్న భ‌రోసా ఏమైనా ఉందా?

+ అమ‌రవీరుల కోసం స్తూపం నిర్మిస్తామ‌న్న కేసీఆర్.. ఐదేళ్లు దాటినా ఒక్క ఇటుక ఎందుకు పెట్ట‌లేదు?

+ కుల సంఘాల‌కు కొత్త భ‌వ‌నాల‌న్నారు. ఆ ఊసేమైంది?

+ ఎర్ర‌మంజిల్ లో మెట్రో.. షాపింగ్.. వివిధ ప్ర‌భుత్వ కార్యాల‌యాలు ఉన్నాయి. అసెంబ్లీకి అక్క‌డ‌కు మారిస్తే తీవ్ర‌మైన ట్రాఫిక్ జాం కాదా?

+ పోడు భూముల వ‌ద్ద కుర్చి వేసుకొని పేద‌ల‌కు పంచుతాన‌న్న ముఖ్య‌మంత్రి హామీ ఏమైంది?