Begin typing your search above and press return to search.

కేసీఆర్ తిట్ల కోసం కాంగ్రెస్ త‌హ‌త‌హ‌?

By:  Tupaki Desk   |   6 Oct 2018 4:17 PM GMT
కేసీఆర్ తిట్ల కోసం కాంగ్రెస్ త‌హ‌త‌హ‌?
X
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల వేడి రాజుకున్న నేప‌థ్యంలో తెలంగాణ ఆప‌ద్ధ‌మ‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్రజా ఆశీర్వాద సభల్లో ఏపీ ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడిపై చంద్ర‌బాబు తీవ్రస్థాయిలో దూష‌ణ‌ల‌కు దిగుతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే, టీడీపీ అధినేత‌ను కేసీఆర్ ఎంత తిడితే అంత మంచిద‌ని, దాని వ‌ల్ల ఏపీలో చంద్రబాబుపై సానుభూతి వ్యక్తమవుతోందని టీడీపీ మంత్రులు - నేత‌లు అభిప్రాయపడుతున్నార‌ని పుకార్లు వ‌స్తున్నాయి. కేసీఆర్ తిట్లు చంద్ర‌బాబుకు దీవెన‌ల‌ని తెలుగు త‌మ్ముళ్లు భావిస్తున్నార‌ని వ‌దంతులు వినిపిస్తున్నాయి. ఈ తిట్ల వ్య‌వ‌హారం తెలంగాణ‌లో మ‌హాకూట‌మిని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ కు మింగుడు ప‌డ‌డం లేద‌ని తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోందట‌. చంద్ర‌బాబును కేసీఆర్ తిట్ట‌డంతో ఆ మైలేజ్ ఆయ‌న‌కు పోతోంద‌ని - ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం హోదాలో ఉన్న త‌మ‌కు ఏమీ ద‌క్క‌డం లేద‌ని కాంగ్రెస్ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నార‌ని టాక్ వ‌స్తోంది. కేసీర్ త‌మ‌ను తిట్ట‌డం లేద‌ని కాంగ్రెస్ నేత‌లు బాధ‌ప‌డున్నార‌ని తెలుస్తోంది.

వాస్త‌వంగా తెలంగాణ‌లో మ‌హాకూట‌మిని లీడ్ చేస్తోంది కాంగ్రెస్. మ‌హా కూట‌మిలో టీడీపీని చిన్న పార్టీగా కాంగ్రెస్ ప‌రిగ‌ణిస్తోంది. ఆ పార్టీకి 10-20 సీట్లు ఇవ్వాల‌ని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ, మ‌హాకూట‌మిని టార్గెట్ చేస్తూ కేసీఆర్...చంద్ర‌బాబును తిట్ట‌డం కాంగ్రెస్ కు మింగుడుప‌డ‌డం లేద‌ట‌. మ‌హాకూట‌మిని తాము లీడ్ చేస్తున్నా కూడా....కేసీఆర్ వ‌ర్సెస్ బాబులా ఈ తిట్ల ఎపిసోడ్ న‌డుస్తోంద‌ని కాంగ్రెస్ నేత‌లు బాధ‌ప‌డుతున్నార‌ట‌. ఈ విష‌యంపై సీరియ‌స్ డిస్క‌ష‌న్ కూడా పెట్టుకున్నార‌ట‌. ఇలాగే చంద్ర‌బాబును తిడితే....మ‌హాకూట‌మి కాస్తా ఆంధ్రా కూట‌మి అయిపోతుంద‌ని, అపుడు కాంగ్రెస్ కు న‌ష్ట‌మ‌ని అనుకుంటున్నార‌ట‌. త‌మను కేసీఆర్ తిట్ట‌డ‌మే ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారమ‌ని కాంగ్రెస్ నేత‌లు భావిస్తున్నార‌ట‌. ఇక‌నైనా కేసీఆర్ త‌మ‌ను కొంచెం గుర్తు పెట్టుకొని తిడితే....తాము కూడా ప్ర‌తిదాడి చేసి నాలుగు తిట్లు తిట్టి మైలేజ్ సంపాదించుకోవ‌చ్చ‌ని వారు భావిస్తున్నార‌ట‌. మ‌రి, కాంగ్రెస్ విజ్ఞ‌ప్తిని కేసీఆర్ ఎంత‌వ‌ర‌కు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారో వేచి చూడాలి.