Begin typing your search above and press return to search.
తె-కాంగ్రెస్ : ఆశ లావు... పీక సన్నం!
By: Tupaki Desk | 10 March 2018 4:16 PM GMTతాము ఖచ్చితంగా గెలిచే అవకాశం లేదని.. వారికి స్పష్టంగా తెలుసు. కానీ పోటీలో మాత్రం దిగి తీరాల్సిందే అనుకుంటున్నారు. ఫిరాయింపులు అన్నీ పక్కన పెట్టినాకూడా.. ఆ ఓట్లన్నీ తమకే పడుతాయి అని అనుకున్నా కూడా.. వారికి విజయం సాధించేంత బలం లేదు. కానీ.. తెరాస ఏకపక్షంగా పదవులను తన్నుకుపోతోంటే మాత్రం చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. రాజ్యసభ ఎన్నికల్లో ఒక స్థానానికి తమ పార్టీ అభ్యర్థిని కూడా మోహరించడానికి నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అందుకే తె-కాంగ్రెస్ వ్యూహం గురించి రాజకీయ వర్గాల్లో.. వారికి ‘‘ఆశ లావు పీక సన్నం’’ అంటో ఛలోక్తులు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో కూడా ప్రస్తుతం మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఒక్కోసీటును గెలుచుకోవాలంటే.. కనీసం 40 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. లేదా మెజారిటీ ఉండాలి. ఇలాంటి నేపథ్యంలో మూడూ తెరాసకు మాత్రమే దక్కే అవకాశం ఉంది. వారికి మజ్లిస్ మద్దతు కూడా సంపూర్ణంగా ఉంటుంది గనుక.. ఆ మేరకు ఒవైసీ ట్వీట్ ద్వారా తమ పార్టీ నిర్ణయం కూడా చెప్పేశారు గనుక.. తెరాస విజయం ఖరారే.
ఆ సంగతి బలాబలాల ప్రకారం చాలా స్పష్టంగా ఉన్నా కూడా.. తమ అభ్యర్థిని మోహరించడానికి కాంగ్రెస్ నిర్ణయించినట్లు సమాచారం. తమ పార్టీ తరఫున మూడో సీటు కోసం మహ్మద్ అజారుద్దీన్ ను గానీ, పార్టీ ట్రెజరర్ గూడూరు నారాయణ రెడ్డిని గానీ మోహరించడానికి వారు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ కు ప్రస్తుతం ఉన్న బలం 12 సీట్లు మాత్రమే. విజయానికి కావాల్సిది 40. ఒరిజినల్ గా వారు గెలిచిన సీట్లుకూడా 21 మాత్రమే. పార్టీలో చేరిన రేవంత్ ఓటును కలుపుకున్నా బలం 13 అవుతుంది. ఎన్నికల్లో నిలబడితే.. విప్ జారీచేసి.. తెరాసలోకి ఫిరాయించిన 9 మందిపై ఒత్తిడి పెంచవచ్చు అనేది ఒక వ్యూహంగా ఉంది. అలాగే.. మజ్లిస్ ఇప్పటికే తమ వైఖరి స్పష్టం చేసినా.. వారి మద్దతుఅడగాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. తెలుగుదేశం రెండు ఓట్లు, వామపక్షాల ఒక్క ఓటు మీద ఆశలు పెట్టుకున్నా కూడా.. ఎన్ని చేసినా.. వారు విజయం సాధించే సంఖ్య అందుకునే అవకాశం లేదని పలువురు విశ్లేషిస్తున్నారు.
మరి ఇలాంటి శ్రమదండగు కసరత్తులకు వారు ఎందుకు తెగిస్తున్నారో అర్థం కావడం లేదని పలువురు అంటున్నారు.