Begin typing your search above and press return to search.
అడ్రస్ మార్చిన తెలంగాణ కాంగ్రెస్
By: Tupaki Desk | 16 Nov 2018 6:34 AM GMTతెలంగాణ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఏదీ అని ఎవరైనా అడిగితే ఠక్కున వచ్చే సమాధానం గాంధీభవన్ అంటారు. ఇది చిన్న పిల్లాడికి తెలుసు. అయితే ఇప్పుడు ఆ అడ్రస్ మారిందంటున్నారు తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టిక్కట్లు దక్కని ఆశావహులు. ఇంతకీ గాంధీ భవన్ అడ్రస్ ఎక్కడికి మారిందనుకుంటున్నారు. నాంపల్లిలో ఉన్న గాంధీ భవన్ సికింద్రాబాద్ కు వచ్చిందనుకుంటున్నారా - మాదాపూర్ కు మారిందనుకుంటున్నారా...ఇవేవి కాదు కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు రాని ఆశావాహులు చెప్పిన ప్రకారం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ అమరావతికి మారిందంటున్నారు. అదేమిటి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా అనే అనుమానం రావచ్చు..తెలంగాణ కాంగ్రెస్ అమరావతిలోని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు - ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడి కార్యలయానికి మారిందని అంటున్నారు.
తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలు జతకట్టాయి. పొత్తు కుదర్చడం వరకే తన పని అని - సీట్లు టిక్కెట్లు వంటివి తనకు సంబంధం లేదని చంద్రబాబు నాయుడు గతంలో తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు చెప్పారు. ఇది విన్నవారంతా నిజమే కామోసు అని అనుకున్నారు. తన జోక్యం ఉండదూ అంటే ఉంటుందీ అని తెలియని కాంగ్రెస్ నాయకులకు టిక్కెట్ల పంపీణీతో విషయం అర్దంమయ్యింది. కాంగ్రెస్ పార్టీతో కుదిరిన పొత్తు మేరాకు అధికారికంగా 14 స్దానాలు తీసుకున్న అనాధికారికంగా 40 మంది వరకు టిక్కట్లు వచ్చేలా చేసారట చంద్రబాబు. ఆ 40 మంది చంద్రబాబు మనుషులేనని అమరావతిలో తన ఛాంబర్లో కూర్చుని ఖరారరు చేసారని కాంగ్రెస్ ఆశావాహుల ఆరోపణ. చంద్రబాబు ఎంపిక చేసిన అభ్యర్దులకు కాంగ్రెస్ అధిష్టానం బీ-ఫారాలు ఇచ్చిందని ఆశావాహలు అంటున్నారు. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కార్యలయం అమరావతికి మారిందనడంలో ఆశ్యర్యం - అనుమానం చెందాల్సిన పనిలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నప్పుడే ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఎన్నో జాగ్రత్తలు చెప్పారని సమాచారం. చంద్రబాబు నాయుడు తన పదవి కాపాడుకోవడం కోసం - తన ఉనికి కోసం ఎలాంటి పనైన చేస్తారని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఒకరిని నమ్మి మోసపోవడం కాంగ్రెస్ పార్టీకి కొత్తేమి కాదని - గతంలో కేసీఆర్ కూడా ఇలాగే చేసారని వ్యాఖ్యనిస్తున్నారు. వ్యూహ రచనలో దిట్టగా పేరున్న కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో కలసి తన గొయ్యి తానే తవ్వుకుందని వ్యాఖ్యానాలు వస్తున్నాయి.