Begin typing your search above and press return to search.
లోక్ సభ బరిలో రేవంత్!..టీ కాంగ్ ఫస్ట్ లిస్ట్ ఇదే!
By: Tupaki Desk | 15 March 2019 5:53 PM GMTసార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైపోయిన నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. ఇందులో భాగంగా ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తెలంగాణలోనూ ఎన్నికల హోరు మొదలైపోయింది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ సీట్లుంటే... వాటిలో హైదరాబాద్ సీటును మజ్లిస్ కు వదిలేసి మిగిలిన 16 సీట్లను క్లీన్ స్వీప్ చేసే దిశగా అధికార టీఆర్ ఎస్ సాగుతోంది. ఈ క్రమంలోనే ఆ పార్టీ ప్రచార హోరును కూడా ఓ రేంజిలో మోగిస్తోంది. అయితే గడచిన ఎన్నికల్లో బొక్కబోర్లా పడిన టీ కాంగ్రెస్ కనీసం లోక్ సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటుదామంటూ రంగంలోకి దిగిపోయింది. ఈ క్రమంలో లోక్ సభ బరిలోకి దిగే అభ్యర్థుల ఖరారుపై ఆ పార్టీ కసరత్తును మొదలెట్టేసింది. ఇందులో భాగంగా తొలి జాబితా కింద ఓ ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ జాబితాను విడుదల చేసిన టీ కాంగ్రెస్... మిగిలిన 9 స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ జాబితా ప్రకారం ఇప్పటిదాకా అభ్యర్థులు ఖరారైన స్థానాలు ఏమిటంటే... ఆదిలాబాద్ - మహబూబాబాద్ - పెద్దపల్లి - కరీంనగర్ - మల్కాజిగిరి - జహీరాబాద్ - చేవెళ్ల - మెదక్ స్థానాలకు అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ జాబితాలో టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పేరు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి బరిలోకి దిగిన రేవంత్... టీఆర్ ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొత్త అభ్యర్థి నరేందర్ రెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. అయితే అసెంబ్లీలో ఓడినా... లోక్ సభ బరిలో సత్తా చాటుతానంటూ మరో సంలచన ప్రకటన చేసిన రేవంత్... లోక్ సభ బరికి సంబంధించి గతంలో టీడీపీకి మంచి పట్టున్న మల్కాజిగిరి నుంచి బరిలోకి దిగుతున్నారట. ఫస్ట్ లిస్ట్ లోనే రేవంత్ కు ఈ స్థానాన్ని ఖరారు చేసిన టీ కాంగ్రెస్ పోటీకి సై అన్న దిశగా వ్యవహరించిందని చెప్పాలి. ఇక రేవంత్ స్థానంతో పాటు మిగిలిన ఏడు స్థానాలకు అభ్యర్థులు ఎవరన్న విషయానికి వస్తే...
మల్కాజిగిరి.... రేవంత్ రెడ్డి,
ఆదిలాబాద్... రమేశ్ రాథోడ్,
మహబూబాబాద్... బలరాం నాయక్,
పెద్దపల్లి.. ఏ చంద్రశేఖర్,
కరీంనగర్... పొన్నం ప్రభాకర్,
జహీరాబాద్... మదన్ రావు,
చేవెళ్ల... కొండా విశ్వేశ్వరరెడ్డి,
మెదక్... గాలి అనిల్ కుమార్